ఒక సినిమా.. ఐదు క్లైమాక్సులు

Update: 2017-02-03 17:18 GMT
ర‌చ‌యిత‌లు.. ద‌ర్శ‌కులు స్క్రిప్టు రాసేట‌పుడు ప్ర‌తి స‌న్నివేశానికీ ఒక‌టికి రెండు వెర్ష‌న్లు రాసుకోవ‌డం మామూలే. క్లైమాక్స్ అంటే ఇంకా స్పెష‌ల్ కాబ‌ట్టి ఇంకా ఎక్కువ వెర్ష‌న్లు ఆలోచించి పెట్టుకుంటుంటారు. యువ ద‌ర్శ‌కుడు సంక‌ల్ప్ రెడ్డి కూడా ‘ఘాజీ’ విష‌యంలో అలాగే ఆలోచించాడ‌ట‌. ఈ చిత్రానికి ఏకంగా ఐదు ర‌కాల క్లైమాక్సులు రాశాడ‌ట అతను. ‘ఘాజీ’ వాస్త‌వ గాథ‌తో తెర‌కెక్కిన సినిమా అయిన‌ప్ప‌టికీ ఇలా క్లైమాక్స్ ఐదు వెర్ష‌న్లు రాయ‌డం విశేష‌మే. ఐతే ఘాజీ అస‌లు క‌థకు సంబంధించి చ‌రిత్ర‌లో ర‌క‌ర‌కాల వెర్ష‌న్లు ఉండ‌టంతో సంక‌ల్ప్ ముగింపు విష‌యంలో ఎటూ తేల్చుకోలేక‌పోయాడేమో.

‘ఘాజీ’ క‌థ సంక‌ల్ప్ త‌న‌కు చెప్పాక‌.. హైద‌రాబాద్ లో త‌న‌కు తెలిసిన రైట‌ర్ల‌తో పాటు బాలీవుడ్ ర‌చ‌యిత‌ల్ని కూడా పిలిచి అనేక వెర్ష‌న్లు రాయించిన‌ట్లు రానా వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. స్వ‌యంగా సంక‌ల్పే క్లైమాక్స్ ఐదు వెర్ష‌న్లు రాయ‌గా.. యూనిట్ స‌భ్యులంద‌రూ చ‌ర్చించి అందులో బెస్ట్ అనిపించిందాన్ని ఫైన‌ల్ చేశార‌ట‌. ఇండియ‌న్ సినిమాలో తొలి స‌బ్ మెరైన్ అండ‌ర్ వాట‌ర్ వార్ ఫిలింగా పేరు తెచ్చుకున్న ‘ఘాజీ’ ఈ నెల 17న తెలుగు.. త‌మిళం.. హిందీ భాష‌ల్లో ఒకేసారి విడుద‌ల‌వుతోంది. పీవీపీ సినిమా నిర్మించిన ఈ చిత్రంలో రానాతో పాటు తాప్సి.. న‌సీరుద్దీన్ షా.. కేకే మీన‌న్‌.. ఓంపురి.. అతుల్ కుల‌క‌ర్ణి కీల‌క పాత్ర‌లు పోషించారు. 1971 నాటి ఇండియా-పాక్ యుద్ధ నేప‌థ్యంలో ఈ సినిమా సాగుతుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News