ఆ మిస్టరీకి ఎలాంటి ముగింపు పలికారో?

Update: 2017-02-08 05:20 GMT
దగ్గుబాటి రానా నటించిన పీరియాడికల్ మూవీ ఘాజీ.. ఈ నెల 17న  థియేటర్లలోకి వచ్చేస్తోంది. తెలుగు.. తమిళ్.. హిందీ భాషల్లో రిలీజ్ కానున్న ఈ మూవీ.. సబ్మెరైన్ థీమ్ తో ఇండియాలో తెరకెక్కిన మొదటి చిత్రం.

1971 ఇండియా పాకిస్తాన్ యుద్ధం సందర్భంగా.. పాకిస్తాన్ కు చెందిన పీఎన్ ఎస్ ఘాజీ సబ్మెరైన్ ద్వారా.. వైజాగ్ తీరంలోని ఐఎన్ ఎస్ విక్రాంత్ పై దాడి జరుగుతుంది. డీజిల్ ఎలక్ట్రిక్ పవర్డ్.. ఫాస్ట్ అటాక్ సబ్ మెరైన్ అయిన ఘాజీ.. విశాఖ తీరంలో మునిగిపోవడం చరిత్రలో ఒక మిస్టరీగా మిగిలిపోయింది. 1971 డి సెంబర్ 5న.. విశాఖ దగ్గరలో సముద్రంపై తేలుతున్న చమురు ఆనవాళ్ల ఆధారంగా.. ఘాజీ అవశేషాలను ఐఎన్ ఎస్ అక్షయ్ గుర్తించింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ.. అంటే 46 ఏళ్లుగా ఈ సబ్మెరైన్ ఎలా తునాతునకలై మునిగిపోయిందనే విషయంపై మాత్రం సస్పెన్స్ వీడలేదు.

ఇదే వాస్తవ గాధను సినిమా కథగా మార్చిన దర్శకుడు  సంకల్ప్.. భారీ బడ్జెట్ తో ఘాజీగా తెరకెక్కించాడు. పీవీపీ సినిమా.. మాట్నీ ఎంటర్టెయిన్మెంట్స్ బ్యానర్లు భారీగానే వెచ్చించి  ఈ చిత్రాన్ని రూపొందించాయి. మరి చరిత్రలో మిగిలిపోయిన సస్పెన్స్ కు.. దర్శకుడు సంకల్ప్ రెడ్డి ఎలాంటి ముగింపు పలికి ఉంటాడో అనే ఆసక్తి నెలకొంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News