ఎట్టకేలకు టాలీవుడ్ ప్రేక్షకులు అందరూ విపరీతంగా ఎదురు చూసిన సంక్రాంతి సీజన్ ముగిసింది. సంక్రాంతి పండుగ మూడు రోజులు ముగియడంతో ఎవరి పనుల్లో వాళ్లు పడ్డారు. సంక్రాంతి సందర్భంగా ఈ సారి రెండు పెద్ద సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వీరసింహారెడ్డి అనే సినిమాతో నందమూరి బాలకృష్ణ 12వ తేదీన తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాకి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు. ఆ తర్వాత ఒకరోజు గ్యాప్‌తో 13వ తేదీన మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాకి బాబీ డైరెక్షన్ చేశారు. ఈ రెండు సినిమాలను మైత్రీ మూవీ మేకర్ సంస్థ నిర్మించడం ఆసక్తి కరం.
అయితే వసూళ్ల విషయంలో వీర సింహారెడ్డి సినిమా కంటే వాల్తేరు వీరయ్య సినిమా ఒక అడుగు ముందు ఉందనే చెప్పాలి.ఈ రెండు సినిమాలకు కొంతమేర బ్రేక్ ఈవెంట్ టార్గెట్లు కూడా పూర్తి కావాల్సి ఉంది. ఈ రోజు నుంచి ఎలా వసూళ్లు వస్తాయనే అంశం మీద ఈ బ్రేక్ టార్గెట్లు పూర్తవుతాయా లేవా అనే అంశం ఆధారపడి ఉంది.
ఇదిలా ఉండగా సంక్రాంతికి వచ్చిన ఇద్దరు దర్శకులు హిట్లు కొట్టారని దాదాపుగా తెలుగు ప్రేక్షకులందరూ ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు ఈ దర్శకుల తరువాతి సినిమాలు ఎవరితో ఉండబోతున్నాయనే విషయం ఆసక్తికరంగా మారింది.
టాలీవుడ్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు గోపీచంద్ మలినేని తరువాతి చిత్రం క్రాక్-2 అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. 2022 మొదట్లో క్రాక్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న గోపీచంద్... అప్పట్లోనే ఆ క్రాక్ సినిమాకి సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు.
దీంతో ఆయన ఆ సినిమా మీద దృష్టి పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవితో కూడా ఒక సినిమా చేయడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్లుగా టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.
ఇక వాల్తేరు వీరయ్య దర్శకుడు బాబీ విషయానికి వస్తే ఆయన ఆ మధ్య విక్టరీ వెంకటేష్‌తో ఒక సినిమా చేయాలని ప్రయత్నించాడు. కానీ ఇప్పుడు రామ్ పోతినేని లేదా నాని హీరోగా ఒక సినిమా చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఈ ఇద్దరు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయినా ఎవరో ఒకరిని సెట్ చేసుకుని సినిమా చేయాలని బాబీ ట్రై చేస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.