సంక్రాంతి సినిమాలు మళ్లీ సమర్‌ పోరుకు రెడీ

Update: 2020-02-03 05:29 GMT
ప్రతి సంక్రాంతి మాదిరిగానే ఈ సంక్రాంతికి కూడా బాక్సాఫీస్‌ ముందు సినిమాలు క్యూ కట్టాయి. మొత్తం నాలుగు సినిమాలు విడుదల అయ్యాయి. అందులో ఒకటి దర్బార్‌ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ డబ్బింగ్‌ సినిమా. రజినీ మూవీ అవ్వడంతో డబ్బింగ్‌ అయినా ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించింది. మొత్తానికి నాలుగు సినిమాలు కూడా సంక్రాంతి పండుగ సందర్బంగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఎంత మంచి వాడవురా మరియు దర్బార్‌ చిత్రాలను తెలుగు ప్రేక్షకులు పట్టించుకోలేదు.

సరిలేరు నీకెవ్వరు మరియు అల వైకుంఠపురంలో చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద హోరా హోరీ తలపడ్డాయి. చివరకు ఆ పోరులో అల వైకుంఠపురంలో విజయం సాధించి ఏకంగా ఇండస్ట్రీ హిట్‌ కొట్టింది. నాన్‌ బాహుబలి రికార్డులను కొల్లగొట్టడం మాత్రమే కాకుండా కొన్ని చోట్ల బాహుబలి 1 ను కూడా క్రాస్‌ చేసింది. అంతటి హంగామా సృష్టించిన సంక్రాంతి సినిమాలు ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ పై ప్రసారంకు సిద్దం అయ్యాయి. మామూలుగా అయితే సినిమాలు విడుదల అయిన నెల రోజుల్లోనే ఓటీటీ పైకి తీసుకు వస్తున్నారు. కాని థియేటర్లలో ఉండగానే ఓటీటీపై రావడంతో కలెక్షన్స్‌ విషయంలో ప్రభావం పడుతుందని ఓటీటీలో ప్రసారంకు కాస్త లేట్‌ గడువు విధించారు.

ఈనెల చివరి వరకు ఆ గడువు ముగిసి పోనుంది. దాంతో ఈ నాలుగు సినిమాలు కూడా మళ్లీ కొద్ది రోజుల గ్యాప్‌ తో సమ్మర్‌ కానుకగా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మొదటగా సన్‌ నెక్ట్స్‌ ద్వారా ఈనెల చివర్లో 'దర్బార్‌' ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ తర్వాత వారం లోపు గ్యాప్‌ తోనే నందమూరి కళ్యాణ్‌ రామ్‌ ఎంత మంచివాడవురా చిత్రం అమెజాన్‌ లో రాబోతుంది.

ఇక సంక్రాంతి ఫస్ట్‌ విన్నర్‌ మరియు సెకండ్‌ విన్నర్స్‌ మార్చిలో రాబోతున్నారు. సరిలేరు నీకెవ్వరు చిత్రం అమెజాన్‌ ప్రైమ్‌ లో మార్చి 7న స్ట్రీమింగ్‌ ప్రారంభం కాబోతుండగా.. ఆ తర్వాత ఒకటి లేదా రెండు రోజులకే సన్‌ నెక్ట్స్‌ ద్వారా 'అల వైకుంఠపురంలో' చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సంక్రాంతికి ఈ సినిమాలను మిస్‌ అయిన వారు ఓటీటీ ద్వారా సమ్మర్‌ లో వీటిని ఎంజాయ్‌ చేసేయండి.
Tags:    

Similar News