సంక్రాంతి సినిమాలు హ్యాపీ

Update: 2016-01-30 13:30 GMT
నాలుగు సినిమాలు వేటికవి చాలా కాన్ఫిడెంటుగా సంక్రాంతి రేసులోకి దిగిపోయాయి కానీ.. ఆ నాలుగు సినిమాల నిర్మాతల్లోనూ లోలోన గుబులే. ఐతే నాలుగు సినిమాలకూ పాజిటివ్ టాకే రావడం.. జనాలు కూడా నాలుగు సినిమాల్నీ ఆదరించడంతో ఈ సంక్రాంతి ఎన్నడూ లేనంతగా కళకళలాడిపోయింది. తొలి వారాంతం అన్ని సినిమాలూ వసూళ్ల పండగ చేసుకున్నాయి. రెండో వారం కొత్త సినిమాలేమీ విడుదల కాకపోవడం సంక్రాంతి మూవీస్ కి బాగా కలిసొచ్చింది. రెండో వీకెండ్ ముగిశాక రిపబ్లిక్ డే కూడా వాటికి అడ్వాంటేజీ అయింది. మూడో వారం కొత్తగా వచ్చిన సినిమాలు కూడా సంక్రాంతి సినిమాల్ని పెద్ద దెబ్బ కొట్టేలా ఏమీ లేవు.

ఈ వారం నాలుగు సినిమాలు విడుదలయ్యాయి కానీ.. అందులో రాజ్ తరుణ్ మూవీ ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ అన్నింట్లోకి ఎక్కువ ఆసక్తి రేపింది. దీనికి ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి కానీ.. టాక్ మాత్రం అనుకున్న స్థాయిలో లేదు. రొటీన్ అన్న ముద్ర ఉండటంతో రెండో రోజుకు సినిమా కొంచెం డల్ అయింది. రాజమౌళి శిష్యుడు జగదీష్ తలసిల రూపొందించిన ‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’ మూవీకి ఓపెనింగ్సూ లేవు, టాక్ కూడా బాగా లేదు. ఆ సినిమా పరిస్థితి అయోమయంగా ఉంది. మిగతావి రెండూ డబ్బింగ్ సినిమాలే. ఇందులో ‘కళావతి’ టాక్ పర్వాలేదు, కలెక్షన్లూ పర్వాలేదు. నయనతార సినిమా ‘నేనూ రౌడీనే’ గురించి జనాలు పెద్దగా పట్టించుకుంటున్నట్లు లేదు.

మొత్తానికి ఈ వారం కొత్త సినిమాల్లో ఫుల్ పాజిటివ్ టాక్ దేనికీ లేదు. దీంతో సంక్రాంతి సినిమాలు మరికొంత కలెక్షన్లు దండుకునే అవకాశం దొరికింది. ముఖ్యంగా సోగ్గాడే చిన్నినాయనా - ఎక్స్ ప్రెస్ రాజా సినిమాలకు శని - ఆదివారాల్లో ఈవెనింగ్ షోలు ఫుల్స్ అయ్యే పరిస్థితి కూడా కనిపిస్తుండటం విశేషం.
Tags:    

Similar News