సంక్రాంతి సినిమాలకు పండగ పూర్తి

Update: 2016-01-26 19:30 GMT
సంక్రాంతి పండుగకు ఎప్పుడూ లేనంత పోటీని క్రియేట్ చేసి, అన్నీ సక్సెస్ సాధించి.. పొంగల్ మూవీస్ టాలీవుడ్ కి మంచి జోష్ నే అందించాయి. మూడు బిగ్ బడ్జెట్ మూవీస్, ఒక చిన్న సినిమా వచ్చి.. అన్నీ పాజిటివ్ టాక్ తెచ్చుకుని, బాక్సాఫీస్ ని కుమ్మేశాయి. అయితే ఈ టఫ్ ఫైట్ లో నాగార్జున సోగ్గాడే చిన్నినాయనను విన్నర్ గా చెప్పాలి. తక్కువ బడ్జెట్ తోనే రూపొందిన సోగ్గాడు.. ఇప్పటికే 30 కోట్లు కొల్లగొట్టేసి భారీ లాభాలనే ఖాతాలో వేసుకున్నాడు.

ఆ తర్వాత స్థానంలో శర్వానంద్ ఎక్స్ ప్రెస్ రాజా నిలిచింది. మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో రూపొందిన ఈ మూవీ.. పది కోట్లకు పైగా కలెక్షన్లతో భారీ లాభాలను ఖాతాలో వేసుకుంది. సుకుమార్ డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో ఇప్పటివరకూ 48 కోట్ల షేర్ రాబట్టి, ఎన్టీఆర్ మూవీస్ లో హిస్టరీ క్రియేట్ చేసింది. అయితే, భారీ బడ్జెట్ తో రూపొందిన కారణంగా.. పెద్దగా లాభాలు వచ్చే అవకాశం మాత్రం నాన్నకు ప్రేమతో చిత్రానికి లేదు. ఇక బాలయ్య డిక్టేటర్ లాస్ట్ ప్లేస్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పటివరకూ 19 కోట్ల షేర్ ని వసూలు చేశాడు డిక్టేటర్. సంక్రాంతి పండక్కి వచ్చిన ఈ సినిమాలు అన్నింటి ఫుల్ రన్స్ కి రిపబ్లిక్ డేతో తెర పడిపోనుంది.

ఇకపై సెలవలు కూడా లేకపోవడం, వచ్చేవారం కొత్త సినిమాలు రిలీజ్ కానుండడంతో, ఇక ఛరిష్మాకి చెక్ పడిపోతున్నట్లే. గతవారమే రెండు సినిమాలు రిలీజ్ కావాల్సి ఉన్నా.. థియేటర్స్ కొరత కారణంగా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఇకపై ఈ నాలుగు సినిమాలకు భారీ మొత్తంలోనో, హౌజ్ ఫుల్స్ తోనో వసూళ్లు రావడం కష్టమే. సో.. ఫుల్ రన్ వసూళ్లపై.. ఈ శుక్రవారం నాటికి ఓ పిక్చర్ వచ్చే ఛాన్స్ ఉంది.
Tags:    

Similar News