వచ్చే సంక్రాంతికి మనకు ఊపిరి సలుపుతుందా?

Update: 2016-09-06 22:30 GMT
తెలుగు రాష్ట్రాలలో అతిపెద్ద పండుగగా భావించేది సంక్రాంతి పండుగ. వరుసపెట్టి మూడు రోజుల పండుగ వాతావరణం, పిల్లలకు పదిరోజులకు పైగా శెలవులు - కొలువులకు లాంగ్ వీకెండ్స్ మరీ నేటివిటీకి వెళ్తే కోళ్ల పందాలు, గొబ్బెమ్మలు, గాలిపటాలు ఇలా కనులవిందుగా సంక్రాంతి పండుగ మనసులో నిలిచిపోతుంది. అయితే సినిమాల విషయంలోకి వస్తే వేసవి తరువాత ఎక్కువమంది టార్గెట్ చేసేది ఈ సీజన్ కే. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన అన్ని సినిమాలూ మంచి విజయాలను సాధించి బాక్స్ ఆఫీస్ స్టామినాని రుజువు చేశాయి. అయితే వచ్చే ఏడాది మనం అనుకున్న పోటీ మరింత రసవత్తరంగా మారే అవకాశం వుంది.

ఇప్పటికే వచ్చే జనవరికి బాలయ్య వందవ సినిమా గౌతమీ పుత్రా శాతకర్ణీ - చిరు 150వ సినిమా ఖైదీ నెంబర్ 150 లు తమ బెర్త్ ని ఖరారు చేసుకున్నాయి. అదీగాక వెంకీ చేతిలో ప్రస్తుతమున్న సినిమాలలో ఏదొక చిత్రం సంక్రాంతి సీజన్ లో విడుదలకానున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఈ రేస్ లోకి కింగ్ నాగార్జున కూడా జాయిన్ అవ్వనున్నట్టు సమాచారం.

ప్రస్తుతం నాగ్ నటిస్తున్న ఓం నమో వెంకటేశాయ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అక్టోబర్ కల్లా చిత్రీకరణ పూర్తవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ - గ్రాఫిక్స్ పనులను చూసుకుని వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదలచెయ్యాలని భావిస్తున్నారు. ఈ సినిమాలన్నీ అనుకున్నట్టుగా విడుదలైతే థియేటర్ ల సంఖ్య సమస్య అటుంచితే అసలు సగటు సినీ ప్రియుడుకి ఆనందంతో ఊపిరి సలుపుతుందా అన్నది ప్రశ్న. 
Tags:    

Similar News