#మెర్స‌ల్: ఏ ప్ర‌భుత్వాన్ని గాయ‌ప‌ర్చ‌లేదు..వైర‌ల్!

Update: 2017-10-23 16:45 GMT
మెర్స‌ల్ -జీఎస్టీ డైలాగుల వివాదం త‌మిళ‌నాడుతోపాటు దేశ‌వ్యాప్తంగా పెను ప్ర‌కంప‌న‌లు రేపుతోంది. ప్ర‌స్తుతం మెర్స‌ల్ పై మీడియా, సోష‌ల్ మీడియాలో చ‌ర్చోప‌చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఆ సినిమాలో డైలాగుల పై బీజేపీ నేత‌ల తీరును దుయ్య‌బ‌డుతూ ప‌లువురు సోష‌ల్ మీడియాలో ఘాటైన కామెంట్లు చేస్తున్నారు. అదే త‌రహాలో ఓ నెటిజ‌న్ ఈ వివాదంపై బీజేపీ తీరును ఎండ‌గ‌డుతూ వ్యంగ్యాత్మ‌కంగా ఓ పోస్ట్ చేశాడు. దానిని లెజెండరీ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ త‌న ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. ప్ర‌స్తుతం ఆ మెసేజ్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.

ప్ర‌స్తుతం సినిమాల్లో మద్యం సేవించ‌డం - పొగ త్రాగడం హానికరం.....ఈ సినిమాలో నిజ‌మైన జంతువుల‌ను ఉప‌యోగించ‌లేదు - హానిప‌ర‌చ‌లేదు....అని డిస్క్రైమర్ వేయ‌డాన్ని మ‌నం గ‌మ‌నిస్తూనే ఉన్నాయం. మెర్స‌ల్ వివాదం నేప‌థ్ంయ‌లో భవిష్యత్తులో స‌రికొత్త డిస్క్లైమర్లు వేయాల్సి వ‌స్తుందేమో అంటూ ఓ నెటిజన్ సెటైర్ వేశాడు. ‘‘ఈ సినిమా చిత్రీకరణ సందర్భంగా ఏ ప్రభుత్వాలనూ గాయపరచలేదు’’ అని స్టాచువరీ వార్నింగ్ సినిమా ఆరంభంలో ప్రదర్శించాల్సిన పరిస్థితి వస్తుందేమో అంటూ ఆ నెటిజన్ వ్యంగాస్త్రాలు సంధించాడు. ఈ మెసేజ్ ను లెజెండరీ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ ట్వీట్ చేశాడు. ఆ సెటైరిక‌ల్ ట్వీట్ కు జనాల నుంచి విప‌రీత‌మైన‌ స్పందన వచ్చింది. మెర్స‌ల్ కు మ‌ద్ద‌తిచ్చినందుకు హీరో విశాల్ కార్యాల‌యంపై జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వ‌హించడం పై కూడా నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. సోష‌ల్ మీడియాలో వచ్చే ఈ త‌ర‌హా సెటైర్ల‌ను నియంత్రించ‌డం బీజేపీ ప్ర‌భుత్వం వ‌ల్ల కాక‌పోవ‌చ్చేమో అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Tags:    

Similar News