గతేడాది విడుదలైన చిన్న సినిమాల్లో పెళ్లి చూపులు విపరీతమైన గుర్తింపుతో పాటు ప్రజాదరణ పొందింది. అంతకంటే ముందు క్షణం మూవీ సెన్సేషన్ సృష్టించింది. చిన్న సినిమాల ప్రభంజనం స్టార్ట్ చేసిన మూవీ క్షణం. ఇదంతా ఎందుకు చెప్పుకోవడం అంటే.. వీటికి మించి మరో సినిమాకి అవార్డులు దక్కడమే కారణం.
తాజాగా ఓ మీడియా హౌస్ అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో చిన్న సినిమాలకు ప్రత్యేకంగా అవార్డులను అందించడాన్ని ప్రత్యేకంగా ప్రశంసించాలి. అయితే.. ఆ ప్రకటించిన అవార్డులే అందరినీ షాక్ కి గురి చేశాయి. చిన్న సినిమాలకు బెస్ట్ మూవీ కేటగిరీలో పెళ్లిచూపులు.. క్షణం.. జయమ్ము నిశ్చయమ్మురాతో పాటు సప్తగిరి ఎక్స్ ప్రెస్ కూడా నామినీస్ లో ఉంది. సప్తగిరి ఎక్స్ ప్రెస్ కు బెస్ట్ అవార్డ్ ప్రకటించిన నిర్వాహకులు ఆశ్చర్యపరిచారు. 1.1 కోట్లతో క్షణం.. 1.3 కోట్ల రూపాయలతో పెళ్లి చూపులు తెరకెక్కి ట్రెండ్ సెట్ చేయగా.. మరో మూవీకి అవార్డ్ ఇవ్వడం ఆశ్చర్యకరమే. పైగా ఇవి ప్రజాదరణ పొందిన సినిమాలు కూడా.
పెళ్లిచూపులు చిత్రానికి ఒక అవార్డ్ కూడా దక్కగపోగా.. హీరో విజయ్ దేవరకొండకు స్పెషల్ జ్యూరీ అవార్డ్ లభించింది. ఉత్తమ నూతన దర్శకుడుగా సోగ్గాడే చిన్ని నాయన డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ ఎంపికయ్యాడు. బెస్ట్ కమెడియన్ కేటగిరీలో పృథ్వీకి అవార్డ్ దక్కగా.. పెళ్లిచూపులు ప్రియదర్శికి నిరాశే మిగిలింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/