సప్తగిరి సర్దేసినట్టేనా?

Update: 2018-06-22 17:30 GMT
కమెడియన్లు హీరోలుగా సక్సెస్ కావడం రాజబాబు కాలం నాటి నుంచి జరుగుతున్నదే. కాకపోతే అది ఎక్కువ కాలం ఉండదు అనేది చరిత్ర చెప్పిన నిజం. యమలీల లాంటి ఇండస్ట్రీ హిట్ కొట్టిన తర్వాత ఆలీ సుమారు పాతిక పైగానే సోలో హీరోగా సినిమాలు చేసాడు. కానీ అవేవి దాని స్థాయిలో ఆడకపోవడంతో తిరిగి కమెడియన్ గా తన స్థానాన్ని సుస్థిరపరుచుకున్నాడు. సునీల్ కేసు కూడా అంతే. ఇప్పుడు ఇలాంటి ప్రయోగాలు చేస్తున్న వాళ్ళ జాబితా పెరుగుతోంది. సప్తగిరి ఎక్స్ ప్రెస్ తో ఓ మాదిరిగా పర్వాలేదు అనిపించుకుని కమర్షియల్ గా వర్క్ అవుట్ చేసుకున్న సప్తగిరి అదే నిర్మాతతో సప్తగిరి ఎల్ ఎల్ బి కూడా చేసాడు. జస్ట్ పాస్ అనిపించుకుంది కానీ గొప్పగా చెప్పుకునే స్థాయిలో మాత్రం ఆడలేదు. ఇక మూడో సినిమా సన్నీ లియోన్ తో చేస్తానని ఆ మధ్య చెప్పిన సప్తగిరి దాని గురించి ఇప్పుడు మాట్లాడ్డం లేదు. కారణం ఆగిపోయిందనే అంటున్నాయి సినీ వర్గాలు. స్క్రిప్ట్ విషయంలో సప్తగిరి తలదూర్చడమే కాక సలహాలు సూచనలు ఇస్తూ ఉండటంతో నిర్మాత అది డ్రాప్ అయినట్టు సమాచారం. ఆ సినిమా షూటింగ్ గురించి అప్ డేట్స్ ఏమి లేవు కాబట్టి నిజమే అనుకోవచ్చు.

సప్తగిరి టైమింగ్ మీద ఎవరికి అనుమానం లేదు. కానీ పూర్తి స్థాయి హీరోగా నిలదొక్కుకోవడానికి ఇంకా టైం పడుతుంది. ఇప్పుడే స్క్రిప్ట్ విషయంలో  జోక్యం చేసుకోవడం కూడా కరెక్ట్ కాదు. సప్తగిరి ఎల్ ఎల్ బి బడ్జెట్ పెరగడం కూడా సప్తగిరి వల్లే అని దాని షూటింగ్ టైంలో టాక్ వినిపించింది. ఇందులో ఏది నిజం ఏది అబద్దం అనేది పక్కన పెడితే సప్తగిరి ఇకనైనా అలెర్ట్ అయిపోయి ఒకపక్క కామెడీ వేషాలు చేస్తూనే మరోపక్క తన బాడీ లాంగ్వేజ్ కి సూట్ అయ్యే కథలను పరిమిత బడ్జెట్ లో హీరోగా  కనక చేసుకోగలిగితే చిన్న సినిమా నిర్మాతలకు ఊతమిచ్చినవాడవుతాడు. కరెక్ట్ గా ఫోకస్ పెడితే ఫామ్ లోకి రావడం పెద్ద విషయం కాదు. దానికి కావాల్సింది కథల ఎంపికలో  జాగ్రత్త. అదే జరిగి సప్తగిరి హిట్టు కొట్టాలని తుపాకీ డాట్ కామ్ కోరుకుంటోంది.
Tags:    

Similar News