ఫోటో స్టొరీ: బాలీవుడ్ అందాల సారామృతం

Update: 2019-06-06 13:53 GMT
సారా అలీ ఖాన్ తెలుసు కదా?  సైఫ్ అలీ ఖాన్- అమృతా సింగ్ ల ముద్దుల కూతురు.  పోయినేడాది సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సినిమా 'కేదార్ నాథ్' తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.  సారా నటించిన రెండో సినిమా రణవీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన 'సింబా'.  రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్స్ గా నిలవడంతో సారా క్రేజ్ పెరిగింది.. తన కెరీర్ ఇప్పుడు జోరుగా సాగుతోంది.  సారా ఈ జెనరేషన్ స్టార్ కిడ్ కావడంతో సోషల్ మీడియాలో టెంపరేచర్ బటన్ ను నొక్కి రెండు మూడు పాయింట్లు పెంచడంలో స్పెషలిస్ట్.

తాజాగా సారా తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటోను పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు సారా "నాకు తెలుసు కానీ మీ హృదయానికి మాత్రం వేసవి.. ఏడాదిలో వచ్చే నాలుగు సీజన్లు కాదు @బాజార్ ఇండియా" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.  అంటే తన ఫోటోతో నెటిజనుల హృదయాల్లోకి ఎండాకాలం వస్తుందని పాపకు ముందే తెలుసు.  అందుకే వేసవి మాత్రమే రావాలని .. అన్నీ సీజన్లు  రాకూడదని స్పష్టంగా తన హాటు సందేశం ఇచ్చింది.  పసుపు.. ఎరుపు.. నీలం రంగు చిన్న పూలు ఉన్న డిజైన్ తో ఉన్న క్రీమ్ కలర్ చుడిదార్ ధరించి స్టైల్ గా సోఫా పై కూర్చుంది. విజిల్స్ రావాలంటే మాస్ ఉండాలన్నట్టు వేసవి రావాలంటే అందాల ప్రదర్శన ఉండాలిగా.. సరిగ్గా నెటిజనుల హృదయంలోకి తన అందాల ప్రదర్శనతో సూటిగా బాణాలు వదిలింది.  ఆ కూర్చున్న పోజు.. ఫేస్ లో ఎక్స్ ప్రెషన్ చూస్తేనే నెటిజనులు ఆమె ఆకర్షణలో పడి మునిగిపోయేలా ఉన్నారు.

చాలామంది నిజంగా మునిగిపోయారు. అందుకే ఈ ఫోటోను పోస్ట్ చేసిన నాలుగు గంటల్లోనే 1.3 మిలియన్ లైక్స్ కొట్టారు. "సమ్మర్ ను వెనక్కు తెస్తున్నావు"..  "రియల్ ప్రిన్సెస్ ఆఫ్ బాలీవుడ్".. "అందంతో ప్రాణం తీసేస్తున్నావే".. "జెన్నిఫర్ ఆనిస్టన్ లా ఉన్నావు" అంటూ డిఫరెంట్ కామెంట్లు పెట్టారు. ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే సారా ప్రస్తుతం 'లవ్ ఆజ్ కల్' సీక్వెల్ 'ఆజ్ కల్' లో నటిస్తోంది. ఇంతియాజ్ అలీ ఈ చిత్రానికి దర్శకుడు.
Tags:    

Similar News