ఫోటో స్టొరీ: వోగ్ కోసం గ్లామరసం చిందించిన సారా!

Update: 2019-04-03 11:30 GMT
బాలీవుడ్ లో ఈమధ్య ఎంట్రీ ఇచ్చిన స్టార్ కిడ్స్ లో అతి తక్కువమంది సక్సెస్ అయ్యారు. అలా విజయం సాధించడంతో పాటుగా ఆడియన్స్ లో క్రేజ్ కూడా తెచ్చుకుంది సైఫ్ అలీ ఖాన్- అమృతా సింగ్ ల ముద్దుల కూతురు సారా అలీ ఖాన్.  డెబ్యూ సినిమా 'కేదార్ నాథ్' తో పాటుగా 'సింబా' కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్స్ గా నిలవడంతో ఫుల్ జోష్ లో ఉంది.  కొద్ది రోజుల క్రితం ఫిలింఫేర్ మ్యాగజైన్ పై మెరిసిన సారా తాజాగా ప్రఖ్యాత వోగ్ మ్యాగజైన్ పై కూడా దర్శనమిచ్చింది.

ఇప్పటివరకూ ఒక లెవెల్లో మాత్రమే గ్లామర్ ను ఒలకబోసిన సారా వోగ్ ఫోటోషూట్ కోసం మాత్రం సెక్సీగా కనిపించింది.  వలలను గుట్టగా వేసి ఉన్న ఒక చోట వాటికి అనుకుని నిలబడిన సారా బ్లాక్ డ్రెస్ లో మతులు పోగొట్టింది. స్టెప్స్ ఉండే బ్లాక్ కలర్ లాంగ్ మిడ్డీ వేసుకున్న సారా బ్లాక్ కలర్ జాకెట్ ను జిప్ ఓపెన్ గా ఉంచేసింది. ఇన్నర్ కూడా చిన్నదిగా ఉండడంతో సారా అందాలు పూర్తిగా కనిపిస్తున్నాయి. ఈ ఘాటు షోకు తోడుగా బ్రౌన్ కలర్ లిప్ స్టిక్ తో మరింత ఘాటుగా ఉండే ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. ఇప్పటివరకూ ఉన్న బ్యూటీలు వేరు.. నేను వేరు అన్నట్టుగా ఉంది వరస.  ఇలాంటి సెక్సీ పోజులిస్తే సోషల్ మీడియా షేక్ అవ్వకుండా ఉంటుందా?

ఇక సారా ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో 'లవ్ ఆజ్ కల్' సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న 'ఆజ్ కల్' లో నటిస్తోంది.   పదేళ్ళ క్రితం రిలీజ్ అయిన 'లవ్ ఆజ్ కల్' లో సైఫ్ అలీ ఖాన్ - దీపిక పదుకొనే జంటగా నటించారు.  ఇప్పుడు సీక్వెల్ లో సైఫ్ కూతురు నటించడం ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించే అంశమే.


Tags:    

Similar News