ఫోటో స్టోరీ: సారా కొత్త స్టిల్ ఔరా!

Update: 2020-01-25 09:42 GMT
బాలీవుడ్ లో ఈతరం స్టార్ కిడ్స్ లో సారా అలీ ఖాన్ ఒకరు. సైఫ్ అలీ ఖాన్-అమృతా సింగ్ ల సంతానం అయిన సారా 'కేదార్ నాథ్' సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతో హిట్ సాధించింది. రెండో సినిమా 'సింబా' సూపర్ హిట్. దీంతో సారాకు క్రేజ్ వచ్చింది. ఇప్పుడు చేతిలో అఫర్లు ఫుల్లుగా ఉన్నాయి. సినిమాలతో పాటుగా సారా సామాజిక మాధ్యమాలలో నిప్పు పెట్టడం.. ఆ మంటను ఎగదోసి నెటిజన్ల కు ఊపిరి ఆడకుండా చేయడం లో స్పెషలిస్టు.

టాలీవుడ్ లో స్టార్ కిడ్స్ హాట్ గా కనిపించరు.. ఎందుకంటే వారికి చాలా పరిమితులు ఉంటాయి. అయితే బాలీవుడ్లో స్టార్ కిడ్స్ వ్యవహారం అలా ఉండదు. వారి గ్లామర్ షో ఏ రేంజ్ లో ఉంటుందంటే నెపోటిజం బ్యాచ్ కానివారు.. కష్టపడి పైకొచ్చే హీరోయిన్లు కూడా ఆ రేంజ్ అందాల విందు చెయ్యలేరు. అందుకే సారా తన ఇన్స్టా గ్రామ్ లో ఫోటోలను పోస్ట్ చేస్తూ నెటిజన్ల తో ఎప్పుడూ టచ్ లో ఉంటుంది. తాజాగా సారా తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఇది 'లవ్ ఆజ్ కల్' సినిమాలోని స్టిల్. సారా ఈ ఫోటో లో ఐరన్ గ్రిల్ ను పట్టుకుని వయ్యారం గా నిలుచుంది. బ్లూ - వైట్ కలర్ కాంబినేషన్ టాప్.. దానికి మ్యాచింగ్ అన్నట్టుగా బ్లూ జీన్స్ ధరించింది. భుజానికి ఒక బ్రౌన్ కలర్ బ్యాగ్ తగిలించుకుంది. నాభి అందాలను ప్రదర్శిస్తూ అల్లరి చూపులు చూస్తోంది. గ్లామర్.. స్టైల్ రెండూ ఈ ఫోటోలో కలగలిసి ఉన్నాయి.

ఈ ఫోటోకు వేలకొద్దీ లైక్స్ వచ్చాయి. సాధారణ నెటిజన్లు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ పెట్టారు. "నాటీ లుక్స్".. "సారా ఆన్ ఫైర్".. "హాటీ ఆజ్ కల్" అంటూ పొగడ్తలు కురిపించారు. ఇక సారా ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే 'లవ్ ఆజ్ కల్' తో పాటుగా మరో సినిమా 'కూలీ నెం.1' లో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.
Tags:    

Similar News