కథానాయిక అవ్వాలని ఎవరు అనుకోరు? అవకాశం ఉంటే వదిలి పెడతారా? ఇప్పుడు క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ కూడా బాలీవుడ్ లో కథానాయికగా రాణించాలని అనుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా సారా యాక్టివిటీస్ ని గమనించిన బాలీవుడ్ మీడియా హింట్స్ ఇస్తూనే ఉంది.
సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ అత్యంత అందమైన ప్రతిభావంతురాలైన హాట్ గాళ్ గా యూత్ లో ఫేమస్ అయ్యింది. సారా తండ్రి సచిన్ టెండూల్కర్ ప్రపంచవ్యాప్తంగా స్టార్ డమ్ కలిగిన క్రికెటర్.
దీనివల్ల సారా ఎప్పుడూ అభిమానుల దృష్టిలో ఉండటం సహజం. ఇదే అంశం సారాను సోషల్ మీడియా సెలబ్రిటీని చేసింది. నెమ్మదిగా అయినా స్థిరంగా డిజిటల్ ఐకాన్ గా తనకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరుచుకుంది. సోషల్ మీడియాల్లో సారాకు అసాధారణ ఫాలోయింగ్ ఉంది.
చాలా కాలంగా సారా భవిష్యత్ లో ఏం అవుతుంది? అన్న ప్రశ్న ఉద్భవిస్తే తన అభిరుచి నటనా రంగం వైపు ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. సారా ఇటీవల మోడల్ గా మారిన సంగతి తెలిసిందే. నటి బానిట సంధుతో కలిసి ఇటీవలే ఓ క్లాథింగ్ లైన్ కి ప్రచారం చేసిన ఫోటోషూట్ అంతర్జాలాన్ని షేక్ చేసింది.
సారా ముగ్ధ మనోహర రూపం కుర్రకారు గుండెల్ని పిండేసిందంటే అతిశయోక్తి కాదు. ఒక బాలీవుడ్ కథానాయిక అయ్యేందుకు అవసరమైన సరంజామా సారాలో పుష్కలంగా దాగి ఉందన్న ప్రశంస వినిపించింది.
లండన్ కాలేజ్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదివిన సారా.. నటనారంగంపైనా మక్కువ పెంచుకుందని మోడలింగ్ అంటే ఎంతో ఆసక్తి కనబరుస్తోందని కూడా టాక్ ప్రముఖంగా వినిపిస్తోంది. ఇక మోడల్ అంటే కథానాయిక అయినట్టే.
ఒకవేళ సారా బాలీవుడ్ లో అడుగుపెడితే తన కెరీర్ ని ముందుకు నడిపించేందుకు గాడ్ ఫాదర్స్ కి కొదవేమీ ఉండదు. సచిన్ కుమార్తెగా తనకు ప్రమోషన్ చాలా ఈజీ. ఒక ప్రముఖ స్టార్ హీరో కుమార్తెకు ఉన్నంత నెపోటిజం బజ్ కూడా క్రియేట్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.