శ్రీమంతుడు సినిమాతో సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ సెకండ్ బిగ్గెస్ట్ హిట్ సాధించి తన సత్తా ఏంటో చాటాడు. మెసేజ్ ప్లస్ కమర్షియల్ యాంగిల్ ని డైరెక్టర్ కమ్ రైటర్ పర్ఫెక్ట్ డీల్ చేయడంతో మూవీ బ్లాక్ బస్టర్ అయింది. అందుకే ఈ సినిమాని బాలీవుడ్ సూపర్ స్టార్ హ్రితిక్ రోషన్ కూడా రీమేక్ చేసేందుకు రెడీ అయిపోయాడు. ఇప్పుడు వీరిద్దరితోపాటు మొత్తం శ్రీమంతుడు యూనిట్ కి కోర్టు నోటీసులు పంపడం హాట్ న్యూస్ అవుతోంది.
శరత్ చంద్ర అనే రైటర్ సిటీ సివిల్ కోర్టులో వేసిన కేసు.. ఈ నోటీసులకు కారణం. మహేష్, హ్రితిక్ లకు మాత్రమే కాకుండా దర్శకుడు కొరటాల శివ, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ యెర్నేని- రవిశంకర్ - సీవీ మోహన్ లకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. తను గతంలో రాసి, ఓ లీడింగ్ మేగజైన్ లో 2012లో పబ్లిష్ అయిన 'చచ్చేంత ప్రేమ' అనే నవల ఆధారంగా శ్రీమంతుడు సినిమాని తీశారన్నది ఆ రైటర్ ఆరోపణ. మొత్తం సినిమా అదే కాకపోయినా.. మెయిన్ ప్లాట్ తన నవలలోదే అంటున్నాడు శరత్ చంద్ర. వెలిగోడు ప్రాజెక్ట్ బేస్డ్ గా ఆ నవల ఉంటుంది.
మార్చ్ 4న ఈ కేసు విచారణకు రానుంది. కోర్టులోనే కాకుండా.. తెలుగు సినీ నిర్మాతల అసోసియేషన్ లో కూడా కొరటాలపై ఫిర్యాదు చేశాడు శరత్ చంద్ర. మరి ఈ కేసు శ్రీమంతుడు టీమ్ ను ఇబ్బంది పెట్టే విషయమే. ఇప్పుడు శ్రీమంతుడు యూనిట్ వెర్షన్ ఏంటన్నదే చూడాలి.