మామూలుగా ప్రీ-రిలీజ్ బిజినెస్ ఫిగర్లు ఈ మధ్యన ఒక 60 కోట్ల రూపాయల రేంజులో ఉంటున్నాయి. కాని పవర్ స్టార్ ''సర్దార్'' రేంజ్ మాత్రం ఏకంగా ఇండస్ర్టీ హిట్ ఎంత వసూలు చేస్తుందో ఆ రేంజులో ఉంది. ఒకసారి ఆ ఫిగర్లను చూద్దాం పదండి.
కేవలం రెండు తెలుగు రాష్ట్రంలలోనే సర్దార్ సినిమాను 61 కోట్ల రూపాయలకు అమ్మేశారు. నైజాంలో అత్యధికంగా 21 కోట్లకు సినిమాను అమ్మితే.. సీడెడ్ లో 10.5 కోట్లకు విక్రయించారట. మిగిలిన ఏరియాలన్నీ కలుపుకుని సర్దార్ సినిమా దాదాపు తెలుగు రాష్ట్రా లలో 61.2 కోట్లకు అమ్ముడుపోయింది ఇక కర్ణాటకలో 8.5 కోట్లకు.. ఓవర్ సీస్ లో 10.5 కోట్లకు సినిమాను అమ్మేశారు నిర్మాతలు. హిందీ వెర్షన్ ను 6 కోట్లకు ఇచ్చేశారట. మొత్తంగా తెలుగు అండ్ హిందీ ధియేట్రికల్ రైట్స్ ను 87.2 కోట్లకు ఇచ్చేశారు. అంటే సినిమా దాదాపు 160 కోట్లు ''గ్రాస్'' వసూలు చేస్తే కాని ఈ మొత్తం సొమ్మును రికవర్ చేయడం కష్టం. దాదాపు ఇది ''శ్రీమంతుడు'' సినిమా రేంజ్ కలెక్షన్ మరి. పవన్ కళ్యాణ్ కు అసాధ్యం అని చెప్పట్లేదు కాని.. తెలుగులో మనోడు చేస్తున్న పేలవమైన ప్రమోషన్ కారణంగా.. రిజల్టుకు రియాక్షన్ ఎలా ఉంటుంది అనేదే అనుమానం.
ఇకపోతే తెలుగు అండ్ హిందీ ఆడియో రైట్స్.. శాటిలైట్ రైట్స్.. డిజిటల్ యుట్యూబ్ హక్కులు.. మొత్తంగా కలుపుకొని.. సినిమాను 108.2 కోట్లు బిజినెస్ చేసింది. ఇదంతా కేవలం పవన్ కళ్యాన్ స్టామినాయే. మరి రికవరీ కూడా ఇదే రేంజులో ఉంటే బావుండు.