రెండు ప్లేసులను సెలక్ట్‌ చేసిన సర్దార్‌

Update: 2016-03-11 12:19 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ సర్దార్ గబ్బర్ సింగ్ మూవీకి సంబంధించి.. అన్ని పనులు వేగం పుంజుకున్నాయి. ఏప్రిల్ 8న విడుదల ఉంటుందా లేదా అనే అనుమానాలు బయల్దేరడంతో.. ఖచ్చితంగా ఆ రోజుకల్లా విడుదల చేస్తామని క్లారిటీ ఇచ్చిన నిర్మాత శరత్ మరార్.. ఆడియో రిలీజ్ వేడుకకు సంబంధించిన డీటైల్స్ కూడా చెప్పారు.

వచ్చే వారంలో సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో విడుదల చేస్తామని శరత్ మరార్ అఫీషియల్ గానే అనౌన్స్ చేసినా.. కరెక్ట్ డేట్ - ప్లేస్ మాత్రం చెప్పలేదు. అయితే.. మార్చ్ 18న సర్దార్ సాంగ్స్ ను విడుదల చేసేందుకు నిర్ణయించారని, ఈ మేరకు యూనిట్ ఏర్పాట్లు చేసుకుంటోందని సమచారం. వెన్యూ విషయంలో కూడా పవన్ అండ్ టీం ఇప్పటికే క్లారిటీకి వచ్చేశారట. హైద్రాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో కానీ - నిజాం కాలేజ్ గ్రౌండ్స్ లో కానీ ఈ వేడుక జరపాలని నిర్ణయించి, ఇప్పటికే అనుమతుల కోసం అప్లై కూడా చేశారని తెలుస్తోంది. వారి నుంచి వచ్చి పర్మిషన్స్ ప్రకారం ఫైనల్ డెసిషన్ తీసుకుంటారని అంటున్నారు.

నిజానికి సర్దార్ గబ్బర్ సింగ్ కి సంబంధించి ఆడియో రిలీజ్ ఫంక్షన్ ను ఏపీ కేపిటల్ అమరావతిలో జరపాలని పవన్ కళ్యాణ్ మొదట భావించారు. అయితే.. ప్రస్తుతం అక్కడి భూముల విషయంలో వివాదం నడుస్తుండడం, అక్కడ ఫంక్షన్ చేస్తే వాటి గురించి మాట్లాడాల్సి ఉండడంతోనే.. పవన్ హైద్రాబాద్ కే మొగ్గు చూపాడనే టాక్ వినిపిస్తోంది.
Tags:    

Similar News