పవర్ స్టార్ ఫ్యాన్స్.. గెట్ రెడీ

Update: 2015-08-25 11:03 GMT
గబ్బర్ సింగ్-2 అసలు మొదలైందా లేదా అన్న అనుమానాలకు తెరదించుతూ ఆగస్టు 15న ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసి అభిమానుల్ని ఆనందంలో ముంచెత్తాడు పవర్ స్టార్. సినిమా టైటిల్ విషయంలో ఉన్న గందరగోళానికి కూడా తెరదించేసి.. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ అనే  కొత్త టైటిల్ తో ముందుకొచ్చాడు పవన్. పోస్టర్ డిజైన్ చేసిన తీరు.. అందులో పవన్ అవతారం చూసి అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. ఒక్క పోస్టర్ తో సినిమా మీద అంచనాలు ఆకాశానికి చేరిపోయాయి. ఫస్ట్ లుక్ పోస్టర్ తాలూకు ఆనందం నుంచి ఇంకా తేరుకోక ముందే.. అభిమానులకు మరో కానుక ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు పవన్.

సెప్టెంబరు 2న పవన్ పుట్టిన రోజన్న సంగతి తెలిసిందే. ఆ రోజు ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఫస్ట్ లుక్ టీజర్ విడుదల చేయబోతున్నట్లు సమాచారం. డైరెక్టర్ బాబి, నిర్మాత శరత్ మరార్ ఇప్పటికే ఆ పనిలో చాలా బిజీగా ఉన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ టీజర్ కు బ్యాగ్రౌండ్ స్కోర్ ఇప్పటికే ఇచ్చేశాడట. ఫస్ట్ లుక్ పోస్టర్ తరహాలోనే టీజర్ కూడా పవన్ ఎనర్జీని క్యారీ చేసేలా ఉంటుందని.. వచ్చే మంగళవారం పవన్ అభిమానులకు పండగే అని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. కొన్ని నెలల పాటు పెంచిన గడ్డం గీసేసిన పవన్.. జులై లో కొన్ని రోజులు షూటింగ్ లో పాల్గొన్నాడు. ఆ తర్వాత గ్యాప్ తీసుకుని రాజకీయ వ్యవహారాల్లో మునిగి తేలుతున్నాడు. మళ్లీ వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తేవాలన్నది ప్లాన్.
Tags:    

Similar News