సినిమాల్లో హీరోలు వాడే వాహనాలు కూడా సమ్ థింగ్ స్పెషల్ అన్నట్టుగా వుంటాయి. మాస్ ని అట్రాక్ట్ చేయడంలో వాహనాలదీ కీలక పాత్రే అని హీరోలు, దర్శకనిర్మాతలు బలంగా నమ్ముతుంటారు. అందుకే ప్రతీ సినిమాకీ స్పెషల్ కేర్ తీసుకొంటూ వాహనాలను డిజైన్ చేయిస్తుంటారు. వాటికోసం ప్రత్యేకంగా బడ్జెట్ కూడా కేటాయిస్తుంటారు. సినిమా అయ్యాక ఆ వాహనాల్ని ఊరూరా తిప్పుతూ ప్రచారం కోసం కూడా వాడుకొంటుంటారు. ఆ రకంగా అటు ఇండస్ట్రీని, ఇటు ప్రేక్షకుల్ని ఆకర్షించిన స్టార్ వాహనాలు చాలానే ఉన్నాయి.
లేటేస్ట్ గా సర్దార్ గబ్బర్ సింగ్ బుల్లెట్ బయటకొచ్చింది. సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లలో ఇప్పుడు ఆ బుల్లెట్ గురించే చర్చంతా. గబ్బర్ సింగ్ గెటప్పుకి తగ్గట్టుగానే దాన్ని తయారు చేయించారు. పవన్ కళ్యాణ్ ఇదివరకు నటించిన గబ్బర్ సింగ్ సినిమాకి ఓ జీపు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. సినిమా పూర్తయ్యాక ఆ జీపును నిర్మాత బండ్ల గణేష్ తన ఇంట్లో గుర్తుగా ఉంచుకొన్నారు కూడా. ఇప్పటికీ తన ఇంటికి వెళ్లినవారికి ఇది గబ్బర్ సింగ్ జీపు అని చూపిస్తుంటారు. గబ్బర్ సింగ్ కి సీక్వెల్ గా వస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో మాత్రం జీపు కాకుండా బుల్లెట్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలవబోతోందని తెలుస్తోంది.
ప్రత్యేకమైన హంగులతో ఆ బుల్లెట్ ని తయారు చేయించారు. బుల్లెట్ కి వెనకా ముందు తుపాకీలు పెట్టుకోవడానికి ప్రత్యేకంగా రెండు లెదర్ బెల్ట్ ల్ని డిజైన్ చేయించారు. స్వతహాగా పవన్ కళ్యాణ్ కి తుపాకీలంటే చాలా ఇష్టం. సర్దార్ గబ్బర్ సింగ్ లో వాటిని విచ్చలవిడిగా వాడాడని తెలుస్తోంది. బుల్లెట్ కూడా ఆయన ఆలోచనలకు తగ్గట్టుగానే తయారైనట్టు చెబుతున్నారు. సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో ఆ బుల్లెట్ ఫొటోని ఇటీవల విడుదల చేశారు. అభిమానుల్ని అది పిచ్చపిచ్చగా ఆకట్టుకుంటూ ఉంది.