పవన్ కళ్యాణ్ ఏ ముహూర్తాన గబ్బర్ సింగ్-2 సినిమా తీయాలనుకున్నాడో కానీ.. నాటి నుంచి ఎప్పుడూ అవాంతరాలే. ఒకసారి సినిమా మొదలై మళ్లీ ఆగిపోవడం.. దర్శకుడు మారడం.. చివరికి షూటింగ్ మొదలైనా నత్తనడకన షూటింగ్ జరగడం పవర్ స్టార్ అభిమానుల్ని అసహనానికి గురి చేసింది. ఐతే ఎట్టకేలకు ‘సర్దార్..’ షూటింగ్ అంతరాయాలు లేకుండా కొంచెం వేగంగానే సాగిపోతున్నట్లు వార్తలొస్తున్నాయి. మరోవైపు ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఉన్న సస్పెన్సుకి కూడా తెరదించేసింది చిత్ర బృందం. ముందుగా అనుకున్నట్లే ఏప్రిల్ 8న పవన్ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుందని ఈ రోజు యూనిట్ సభ్యుల నుంచి మీడియాకు సమాచారం అందింది.
ఈ డేటు విషయంలో కొన్ని రోజులుగా తర్జనభర్జనలు నడుస్తున్నాయి. ‘సర్దార్..’ మే నెలకు వాయిదా పడిందని.. అసలు ఆ నెలలో కూడా సినిమా విడుదల కావడం కష్టమేనని ఊహాగానాలు సాగాయి. వాటన్నింటికీ తెరదించేస్తూ ఏప్రిల్ 8నే సినిమా రిలీజ్ అని ప్రకటించేయడంతో ఇక పవన్ అభిమానుల ఆనందానికి అవధుల్లేనట్లే. ‘పవర్’ ఫేమ్ బాబి దర్శకత్వం వహిస్తున్న ‘సర్దార్ గబ్బర్ సింగ్’లో కాజల్ కథానాయికగా నటిస్తోంది. పవన్ మిత్రుడు శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. పవన్ స్వయంగా కథ - స్క్రీన్ ప్లే ఈ చిత్రానికి అందిస్తుండటం విశేషం. ప్రస్తుతం కేరళలో షూటింగ్ జరుపుకుంటున్న ‘సర్దార్’ యూనిట్.. త్వరలోనే హైదరాబాద్ లో లాంగ్ షెడ్యూల్ కు శ్రీకారం చుట్టనుంది.