అసలే పవన్ కళ్యాణ్.. పైగా దాదాపు మూడేళ్ల విరామం తర్వాత హీరోగా చేసిన సినిమా.. అందులోనూ మంచి సీజన్ లో రిలీజవుతోంది. ఇక క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పేదేముంది? విడుదల తర్వాత ఈ సినిమా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో.. ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో కానీ.. రిలీజ్ కు ముందు బిజినెస్ విషయంలో ప్రభంజనమే సృష్టిస్తోంది సర్దార్ గబ్బర్ సింగ్. వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ విషయంలో ‘సర్దార్’ నాన్-బాహుబలి రికార్డుల్ని కొల్లగొట్టేసింది. ఇక రిలీజయ్యే థియేటర్ల సంఖ్య కూడా నాన్-బాహుబలి సినిమాల్లో రికార్డే. ఐతే ఒక విషయంలో ‘బాహుబలి’ని కూడా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ దాటేయబోతోంది. జక్కన్న విజువల్ వండర్ కంటే కూడా పవన్ సినిమానే అత్యధిక దేశాల్లో విడుదల కాబోతోంది.
ప్రపంచవ్యాప్తంగా మొత్తం 42 దేశాల్లో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ విడుదల కాబోతుండటం విశేషం. ‘బాహుబలి’ సైతం ఇన్ని దేశాల్లో ఒకేసారి రిలీజవ్వలేదు. దాని కౌంట్ ఎంత అన్నది క్లారిటీ లేదు. ఎందుకంటే ఒకదాని తర్వాత ఇంకో దేశం అన్నట్లు బాహుబలి రిలీజ్ కంటిన్యూ అవుతూనే ఉంది. సౌత్ ఇండియాలో రజినీకాంత్ సినిమాల్ని మినహాయిస్తే అత్యధిక దేశాల్లో రిలీజవుుతన్న రికార్డు ‘సర్దార్’దే. యుఎస్ - కెనడా - ఆస్ట్రేలియా - యూఏఈ - సింగపూర్ - యూకే లాంటి రెగ్యులర్ గా తెలుగు సినిమాలు రిలీజయ్యే దేశాలతో పాటు కొత్త కొత్త దేశాల్లోనూ అడుగుపెడుతోంది ‘సర్దార్’. ఇప్పటికే ఆయా దేశాల్లో థియేటర్లు కూడా బుక్ అయిపోయాయి. ఏప్రిల్ 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.