‘‘పాటొచ్చి పదేళ్లయింది.. పవర్ తగ్గలా’’ అంటూ ఖుషి సినిమాను రిఫర్ చేస్తూ ఓ డైలాగ్ చెబుతాడు ఆలీ ‘గబ్బర్ సింగ్’ సినిమాలో. నిజమే.. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేని పవర్ పవన్ కళ్యాణ్ కే సొంతం. ‘అత్తారింటికి దారేది’ తర్వాత హీరోగా దాదాపు మూడేళ్ల గ్యాప్ వచ్చేసినా పవన్ పవర్ ఏమాత్రం తగ్గలేదు అనడానికి ‘సర్దార్ గబ్బర్ సింగ్’ విషయంలో నెలకొన్న హైపే నిదర్శనం. విడుదలకు దాదాపు నాలుగు నెలల ముందే ఈ సినిమాకు దాదాపుగా బిజినెస్ అయిపోవచ్చిందని.. అన్ని ఏరియాల్లోనూ రికార్డు ప్రైస్ కే అమ్మకాలు జరిగాయని సమాచారం.
ఒక్క నైజాంలో మినహాయిస్తే అన్ని ఏరియాల్లోనూ ‘సర్దార్..’ బిజినెస్ పూర్తి చేసేశారట. పవన్ సినిమాల్లో ఇదే హైయెస్ట్ ప్రి రిలీజ్ బిజినెస్ జరుపుకున్న సినిమా అని సమాచారం. ఏ ఏరియాకు ఎంత రేటు పలికిందన్నది తెలియడం లేదు కానీ.. నైజాం మినహా అన్ని ఏరియాలకూ నిర్మాత శరత్ మరార్ బిజినెస్ అవగొట్టేశాడని అంటున్నారు. ఓవర్సీస్ లో ‘బాహుబలి’ తర్వాత అత్యంత భారీగా విడుదల కాబోయే తెలుగు సినిమా ఇదే కాబోతోందని సమాచారం. ఈ సినిమా నిర్మాణ భాగస్వామి ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ.. ‘ఐ డ్రీమ్స్’తో కలిసి విదేశాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతోంది. ఓవర్సీస్ రైట్స్ మాత్రమే పది కోట్లకు పైనే పలికి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. బిజినెస్ మొత్తం రూ.70 కోట్లను దాటేయొచ్చని అంటున్నారు.