ఎప్పుడో మొదలవ్వాల్సిన సినిమా ఇంకెప్పుడో మొదలైంది. ఇక షూటింగ్ సంగతి సరే సరి. ఇప్పటిదాకా ఎన్ని రోజులు షూటింగ్ చేశారో తెలియదు. ఎంత సినిమా పూర్తయిందో కూడా తెలియదు. అప్పుడప్పుడూ పవన్ షూటింగ్ స్పాట్ లో దిగిన ఫొటోలు తప్పితే ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ప్రోగ్రెస్ గురించి జనాలకు క్లారిటీ లేదు. షూటింగ్ జరుగుతోందన్నదానికంటే.. సరిగా అవ్వట్లేదట.. పవన్ డైరెక్టర్ - ప్రొడ్యూసర్ పై కోపంగా ఉన్నాడట.. ఈ టైపు వార్తలే ఎక్కువగా వినాల్సి వస్తుండటంతో పవర్ స్టార్ అభిమానులకు కొంచెం చిరాగ్గా ఉంది. రిలీజ్ విషయంలోనూ చాలా అనుమానాలు కూడా ముసురుకున్నాయి. ఇలాంటి సమయంలో ‘సర్దార్ గబ్బర్ సింగ్’కు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది.
ఈ నెల 28 నుంచి 70 రోజుల పాటు ఏకధాటిగా సర్దార్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారట. ఆదివారాలు మినహాయించి నిర్విరామంగా షూటింగ్ చేయాలని ఫిక్సయ్యారట. ఈ ప్లానింగ్ అంతా పవన్ దే అని సమాచారం. ఇప్పటిదాకా చాలా రోజులు షూటింగ్ చేసినా సినిమా సగం కూడా పూర్తవ్వలేదట. మధ్య మధ్యలో గ్యాపులు - షెడ్యూళ్లు అనుకున్న ప్రకారం జరక్కపోవడం పట్ల పవన్ సహా అందరూ అసంతృప్తిగానే ఉన్నారట. అందుకే పక్కా ప్లానింగుతో 70 రోజుల పాటు షూటింగ్ చేసి సినిమాను దాదాపుగా పూర్తి చేసేయాలని ఫిక్సయ్యారట. ఈ లెక్కన మార్చి ప్రథమార్ధానికల్లా సినిమా పూర్తి చేసి.. ఏప్రిల్లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేయాలన్నది ప్రణాళిక. మరి ఈ ప్లానింగ్ ఏమాత్రం వర్కవుటవుతుందో చూడాలి.