`ఏజెంట్` కోసం అఖిల్ అంత పెద్ద త్యాగం?

Update: 2021-04-26 11:30 GMT
అక్కినేని అఖిల్ ప్ర‌స్తుతం త‌న కెరీర్ ఐదో చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. అఖిల్- 5 కి సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో అతడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ (అఖిల్ 4) చిత్రంలో న‌టించిన సంగ‌తి తెలిసిందే.

అయితే సురేంద‌ర్ రెడ్డి స్థానంలో నిజానికి అభిమ‌న్యుడు ఫేమ్ మిత్ర‌న్ అఖిల్ తో ప‌ని చేయాల్సింది. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా క‌థా చ‌ర్చ‌లు సాగుతున్నాయ‌ని కూడా `మిస్ట‌ర్ మ‌జ్ను` (వెంకీ అట్లూరి ద‌ర్శ‌కుడు) రిలీజ్ టైమ్ లో ప్ర‌చారం సాగింది. కానీ అఖిల్ ఆ అవ‌కాశాన్ని వ‌దులుకున్నారు. అదే క్ర‌మంలో సైరా డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డిని అఖిల్ లాక్ చేశాడు. సురేంద‌ర్ రెడ్డి అఖిల్ కి స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ కథ‌ను చెప్పారు. స్క్రిప్ట్ ని లాక్ చేసి ప్ర‌స్తుతం ప్రీప్రొడ‌క్ష‌న్ ప‌నుల్ని సాగిస్తున్నారు. ఇటీవ‌లే సినిమాని అధికారికంగా లాంచ్ చేసిన సంగ‌తి తెలిసిందే.

అయితే ఇంత‌కుముందు అఖిల్ వ‌దులుకున్న కాన్సెప్ట్ తోనే కార్తీ హీరోగా పి.ఎస్ మిత్ర‌న్ సినిమా చేస్తున్నారు. స‌ర్ధార్ అనేది టైటిల్. తాజాగా టైటిల్ తో పాటు కార్తీ లుక్ ని రిలీజ్ చేశారు. ఈ లుక్ తో పాటు కాన్సెప్ట్ చాలా ఆస‌క్తిక‌రంగా క‌నిపిస్తోంది. ఇండియా పాకిస్తాన్ చైనా అంటూ టైటిల్స్ లోనే పెద్ద స‌బ్జెక్ట్ ని ట‌చ్ చేశాడు మిత్ర‌న్. జీవీ ప్ర‌కాష్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంట‌ర్నేష‌న‌ల్ స్టాండార్డ్స్ తో మోష‌న్ పోస్ట‌ర్ విలువ‌ను పెంచింది. పండిన గుబురు గ‌డ్డంతో కార్తీ స‌రికొత్త అవ‌తారంలో షాకిచ్చాడు.

ఇక కాన్సెప్ట్ ఎంచుకోవ‌డంలో మిత్ర‌న్ ఎత్తుగ‌డ‌ త‌ర్వాతే. అత‌డు విశాల్ కి అభిమ‌న్యుడు లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీని ఇచ్చాడు. హైటెక్ మోసాల నేప‌థ్యంలో అద్భుత‌మైన చిత్ర‌మిది. అత‌డు తెర‌కెక్కించిన రెండు చిత్రాలు దేనిక‌దే ప్ర‌త్యేకం. అందుకే మిత్ర‌న్ తో అఖిల్ సినిమా చేస్తే బావుంటుంద‌ని అభిమానులు భావించారు. కానీ ఆ ఆఫ‌ర్ ని అఖిల్ వ‌దులుకున్నాడు.

ఇటీవ‌లే అత‌డి ఏజెంట్ లుక్ రిలీజైన సంగ‌తి తెలిసిందే. ఇందులో అఖిల్ స్పై పాత్ర‌లో న‌టిస్తున్నాడు. అయితే మిత్ర‌న్ రిలీజ్ చేసిన తాజా పోస్ట‌ర్ చూస్తున్నా గూఢ‌చారి త‌ర‌హా థ్రిల్ల‌ర్ కాన్సెప్ట్ అనే అర్థ‌మ‌వుతోంది. ప్ర‌పంచ‌దేశాల‌కు ప‌య‌న‌మ‌య్యే ఒక ర‌హ‌స్య గూఢచారిగా కార్తీ న‌టిస్తున్నారా? అన్నదానికి ఇంకా స‌స్పెన్స్ వీడాల్సి ఉంది. ఏజెంట్ ... స‌ర్థార్ .. ఈ రెండిటిలో ఏది బెస్ట్ స్పై థ్రిల్ల‌ర్ అవుతుందో ప్రేక్ష‌కులే నిర్ణ‌యించాల్సి ఉంటుంది.Full View
Tags:    

Similar News