మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్‌తో ఒక నిర్మాత నాలుగు సినిమాలు నిర్మించడమంటే చిన్న విషయం కాదు. వేరే నిర్మాతల భాగస్వామ్యంతో చేసినప్పటికీ ఇది అరుదైన విషయమే. ఈ ఘనత అనిల్ సుంకరకే చెందుతుంది. ఐతే బేసిగ్గా మహేష్ బాబుకు వీరాభిమాని అయిన అనిల్.. తాను నిర్మాతననే విషయం మరిచిపోతుంటాడు. మహేష్ బాబుకు ఎలివేషన్లు ఇవ్వడమే పనిగా పెట్టుకునే ఆయన.. ఆ హీరోతో ఏ సినిమా చేసినా కలెక్షన్ల గురించి, రికార్డుల గురించి ఒకటే ఊదరగొట్టేస్తుంటాడు. మరీ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా విషయంలో అయితే ఆయన మరీ శ్రుతి మించిపోయారు. పీఆర్వో లాగా మారిపోయి.. తన స్థాయికి తగని కామెంట్లు, ట్వీట్లతో సినిమాను పైకి లేపే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఆయన ఫేక్ కలెక్షన్లు, రికార్డులతో కూడిన ట్వీట్లతో జనాల్లో పలుచన అయిపోయిన మాట వాస్తవం.
నిజానికి ‘సరిలేరు నీకెవ్వరు’ అంచనాల్ని మించి వసూళ్లు రాబట్టింది. కంటెంట్ అంతంతమాత్రమే అయినా రూ.100 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసి మహేష్ కెరీర్లోనే హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఇందుకు సంతృప్తి చెందాల్సింది పోయి.. దీన్ని నాన్-బాహుబలి హిట్‌గా ప్రచారం చేసుకోవడమే విడ్డూరం. ఓవైపు ‘అల వైకుంఠపురములో’ స్పష్టమైన పైచేయి సాధిస్తూ.. నాన్-బాహుబలి రికార్ డును సొంతం చేసుకుంటే వాళ్లకు పోటీగా వీళ్లు కూడా నాన్-బాహుబలి బ్లాక్‌బస్టర్ అని.. రియల్ సంక్రాంతి విన్నర్ అని పోస్టర్ల మీద వేసుకుని పరువు తీసుకున్నారు. వాస్తవం ఏంటన్నది అందరికీ తెలిసినా ఈ రకమైన ప్రచారం ఆగలేదు.
మూడో వారానికే ‘సరిలేరు..’ థియేట్రికల్ రన్ దాదాపుగా ముగిసింది. ఏవో కొన్ని సెంటర్లలో నామమాత్రంగా సినిమా నడిచింది. ఐతే ఇప్పుడు సినిమా విడుదలై 50 రోజులు పూర్తయిన నేపథ్యంలో మళ్లీ అనిల్ రంగంలోకి దిగాడు. 50 రోజుల సెంటర్ల లిస్టును ట్విట్టర్లో పెట్టాడు. అంతటితో ఆగకుండా ప్రింట్ మీడియాకు యాడ్స్ ఇచ్చాడు. అందులో ‘హైయెస్ట్ గ్రాసర్ ఆఫ్ టాలీవుడ్ నాన్-బాహుబలి 2 ఇన్ తెలుగు స్టేట్స్’ అని ఘనంగా ప్రకటించుకున్నాడు. అదే పోస్టర్ మీద ‘ఆల్ టైం ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ నాన్ బాహుబలి 2 ఇన్ తెలుగు స్టేట్స్’ అని మరో స్టేట్మెంట్ కూడా ఇచ్చేశాడు. జనాలు మాత్రం ఇది చూసి ఈ కామెడీ ఇంకెంత కాలం కొనసాగుతుంది.. 100 రోజుల నాడు ఇంకేం పోస్టర్లు వదులుతాడో ఈ నిర్మాత అంటూ జోకులు పేలుస్తున్నారు.