సరిలేరు నీకెవ్వరు మూవీ ఆ సీనియర్ నటికి మైనస్?

Update: 2022-09-07 04:41 GMT
మిగిలిన రంగాలతో పోలిస్తే.. సినిమా రంగంలో పొగడ్తలు వినిపించినంత ఎక్కువగా విమర్శలు అస్సలు వినిపించవు. కడుపులో ఎంత ఉన్నా.. పెదవి దాటి బయటకు వచ్చేవి చాలా చాలా తక్కువ. లేని రచ్చ పెట్టుకొని.. నలుగురి నోట్లో నానటం ఎందుకు? ఏమంటే.. మరేవుతుందో? అన్న భయం కూడా కనిపిస్తుంటుంది.

అలాంటి వేళలో.. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటానికి.. తాను ఏం ఫీల్ అయ్యిందన్న విషయాన్ని చెప్పటానికి కొందరు ఆర్టిస్టు అస్సలు వెనుకాడరు. గతంలో పోలిస్తే.. ఈ మధ్యన అలాంటి ధోరణి కాస్త ఎక్కువైందనే చెప్పాలి. తాజాగా అదే విషయాన్ని తన మాటలతో చెప్పేశారు సీనియర్ నటి సంగీత.

తాజాగా ఆమె నటించిన 'మసూద' హర్రర్ మూవీ ప్రమోషన్ లో ఉన్నారు. ఈ సందర్భంగా ఇస్తున్న ఇంటర్వ్యూల్లో పలు ఆసక్తికర అంశాల్నివెల్లడిస్తున్నారు. నటిగా.. హీరోయిన్ గా వెలిగిన సంగీత ఆతర్వాత కాస్తంత బ్రేక్ తీసుకొని... అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరు మూవీలో హీరోయిన్ తల్లిగా రీఎంట్రీ ఇచ్చిన  విషయం తెలిసిందే.

చాలా గ్యాప్ తర్వాత రీఎంట్రీగా ఎంచుకున్న సరిలేరు నీకెవ్వరు మూవీ మీకు ప్లస్సా? మైనస్సా? అన్న ప్రశ్నను సంధించిన వేళ.. షాకింగ్ సమాధానం చెబుతూ.. రెండూ అంటూ జవాబిచ్చారు.

అనిల్ రావిపూడి వచ్చి తనకు కథ వివరించారని.. ఇప్పుడు అనిల్ ని చూస్తే..'రేయ్ ఇలా చేశావ్ రా నన్ను' అని తిడతానని పేర్కొన్నారు. ప్రస్తుతం పలు రియాల్టీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్న ఆమెను.. మీరు అవకాశం వదులుకున్న సినిమాలు ఏమైనా ఉన్నాయా?

అంటే.. ఒక సినిమా షూట్ కు రెండు రోజులు వెళ్లానని.. ఆ తర్వాత వాళ్లు తనను సినిమా నుంచి తీసేశారంటూ గతాన్ని గుర్తు చేసుకుంటూ చెప్పుకొచ్చారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News