'సర్కారు వారి పాట' టాలీవుడ్ రికార్డ్స్ అన్నీ బ్రేక్ చేసిందన్నమాట..!

Update: 2022-05-23 08:30 GMT
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురాం పెట్లా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ''సర్కారు వారి పాట''. ప్రపంచ వ్యాప్తంగా మే 12న విడుదలై తొలి రోజే మిశ్రమ స్పందన తెచ్చుకుంది. అయినప్పటికీ మహేష్ స్టార్ పవర్ తో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. మేకర్స్ చెబుతున్న లెక్కల ప్రకారం దేశీయ మరియు ఓవర్సీస్ మార్కెట్ లో రెండవ వారంలోనే ఈ సినిమా ప్రాఫిట్ జోన్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే 100 కోట్ల షేర్ మార్క్‌ ను క్రాస్ చేసిన 'సర్కారు వారి పాట' సినిమా.. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 196.1 కోట్ల గ్రాస్ రాబట్టి 200 కోట్ల గ్రాస్ క్లబ్ కు చేరువైందని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. రెండో వారంలో టికెట్ రేట్లు తగ్గడంతో SVP వసూళ్ళు పర్వాలేదనిపిస్తున్నాయి. దీంతో సెకండ్ వీకెండ్ ముగిసే సమయానికి బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకుంది.

అంతేకాదు 'సర్కారు వారి పాట' టాలీవుడ్‌ లో అన్ని సినిమాల బాక్సాఫీస్ రికార్డ్స్ బద్దలు కొట్టి.. అత్యధిక వసూళ్లు సాధించిన ప్రాంతీయ చిత్రంగా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసినట్లు మేకర్స్ తెలిపారు. ఇంతకుముందు మహేష్ నటించిన 'భరత్ అనే నేను' 'మహర్షి' మరియు 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలు 100 Cr+ షేర్ వసూలు చేసాయి. కాబట్టి ఇప్పుడు SVP మహేష్ బాబుకి వరుసగా నాలుగో 100 కోట్ల+ షేర్ సినిమా అవుతుంది.

అలానే ఓవర్సీస్ మార్కెట్‌ లో మహేష్ బాబు మునుపటి చిత్రం 'సరిలేరు నీకెవ్వరు' లైఫ్ టైం కలెక్షన్స్ ($2,288,613) క్రాస్ చేసి.. సూపర్ స్టార్‌ కి ఓవర్సీస్‌ లో అతిపెద్ద హిట్‌ గా నిలిచింది. 'సర్కారు వారి పాట' సినిమా  ఆదివారం రాత్రికి 155 లొకేషన్స్ నుండి $26,573 వసూలు చేసింది. దీంతో మొత్తం కలెక్షన్స్ $2,291,728కి చేరుకున్నాయి.

సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా.. మహేష్ బాబు స్టామినా ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తోందని 'సర్కారు వారి పాట' సినిమా వసూళ్లను బట్టి అర్థం అవుతోంది. గత శుక్రవారం క్రేజీ సినిమా ఏదీ రిలీజ్ అవ్వకపోవడంతో.. రెండవ వారంలో ఈ చిత్రానికి పోటీ లేకుండా పూర్తి ప్రయోజనాన్ని పొందుతోంది.

SVP మేకర్స్ ప్రకటించిన లెక్కల ప్రకారం 11 రోజుల వరల్డ్ వైడ్ గ్రాస్ వివరాలు ఇలా ఉన్నాయి:
AP/TG - 153.8 కోట్లు
KA+ROI - 14.9 కోట్లు
ఓవర్సీస్ - 27.4 కోట్లు
మొత్తం = 196.1 కోట్లు

ఏదైతేనేం 'సర్కారు వారి పాట' సినిమా మహేష్ బాబు కెరీర్‌ లోని బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌ గా నిలిచింది. ఇది టాలీవుడ్ లో అత్యధిక గ్రాస్ వసూలు చేసిన ప్రాంతీయ చిత్రంగా ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసినట్లు నిర్మాతలు చెబుతున్నారు. అంటే 'సరిలేరు నీకెవ్వరు' తో పాటుగా 'అల వైకుంఠపురములో' 'రంగస్థలం' 'పుష్ప 2' 'కేజీఎఫ్ 2' తెలుగు వెర్షన్ కలెక్షన్స్ ను SVP క్రాస్ చేసిందన్న మాట.

అయితే మేకర్స్ చెబుతున్న సర్కారు వారి పాట సినిమా కలెక్షన్స్ పై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు కలెక్షన్ల మాయాజాంలపై ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో RRR వసూళ్లను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ.. ''కలెక్షన్ల రిపోర్ట్ ఇవ్వడం డిస్ట్రిబ్యూటర్‌ గా మా బాధ్యత.. నిర్మాతలు వాళ్లకు నచ్చిన ఫిగర్స్ వాళ్లు వేసుకుంటున్నారు'' అని అన్నారు.

ఇప్పుడు 'సర్కారు వారి పాట' సినిమాకి కూడా డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు అనే సంగతి తెలిసిందే. సో దీనికి కూడా దిల్ రాజు కలెక్షన్స్ రిపోర్ట్స్ పంపిస్తే.. నిర్మాతలు తమకు నచ్చిన ఫిగర్ వేసుకుంటున్నారేమో అని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు
Tags:    

Similar News