సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం చేస్తున్న సర్కారు వారి పాట పై అంచనాలు భారీగా ఉన్నాయి. గీత గోవిందం దర్శకుడు పరశురామ్ దర్శకత్వం లో రూపొందుతున్న ఈ సినిమాలో మహానటి ఫేమ్ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే. సరిలేరు నీకెవ్వరు సినిమా తో బిగ్గెస్ట్ సక్సెస్ ను గత ఏడాది దక్కించుకున్న మహేష్ బాబు ఈ సినిమా తో వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. పరశురామ్ ఈ సినిమా ను బ్యాంకింగ్ రంగంలో ఉన్న అవినీతి మరియు కొన్ని లొసుగులను గురించి ఎత్తి చూపించేందుకు గాను తెరకెక్కిస్తున్నారు. చక్కని మెసేజ్ తో పాటు ఆకట్టుకునే కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఈ సినిమా లో ఉంటాయని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. ఇక ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా యాక్షన్ కింగ్ అర్జున్ ను నటింపజేయబోతున్నట్లుగా తెలుస్తోంది.
తెలుగు లో ఈమద్య కాలంలో యాక్షన్ కింగ్ అర్జున్ విలన్ పాత్రల్లో నటిస్తూ మెపిస్తూ వచ్చాడు. తెలుగు ప్రేక్షకులకు సుదీర్ఘ కాలంగా సుపరిచితుడు అయిన అర్జున్ ఖచ్చితంగా సర్కారు వారి పాట సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాడనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ కు ముందు రెండవ షెడ్యూల్ ను ప్రారంభించేందుకు ప్రయత్నించారు. కాని కరోనా కేసులు విపరీతంగా పెరిగిన కారణంగా ఆ సమయంలో షూటింగ్ ను నిలిపి వేయడం జరిగింది. ఎట్టకేలకు మళ్లీ సర్కారు వారి పాట పునః ప్రారంభంకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
మహేష్ బాబు సర్కారు వారి పాటలో యాక్షన్ కింగ్ అర్జున్ పాత్ర గురించి ప్రముఖంగా ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఈ సినిమాలో ఆయన పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడట. పోలీస్ గా ఆయన పాత్ర కథలో అత్యంత కీలకంగా ఉంటుందని అంటున్నారు. అయితే ఆయన పోషించబోతున్న పాత్ర నెగటివ్ షేడ్స్ తో ఉంటుందా లేదంటే పాజిటివ్ గా ఉంటుందా అనేది క్లారిటీ లేదు. స్టైలిష్ విలన్ గా గతంలో మంచి పేరు తెచ్చుకున్న అర్జున్ ఈ సినిమాలో విలన్ గా కనిపిస్తేనే సినిమాకు మరింత ఆకర్షణ గా నిలుస్తాడని అభిమానులు అంటున్నారు.
సర్కారు వారి పాట సినిమా చిత్రీకరణ ఒక వైపు జరుగుతున్న సమయంలోనే మరో వైపు మహేష్ బాబు తన తదుపరి సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసేందుకు సిద్దం అయ్యాడు. సర్కారు వారి పాట సినిమా ఒక కొలిక్కి వచ్చిన వెంటనే త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా మొదలు పెట్టే అవకాశం ఉంది. సర్కారు వారి పాట సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమా ను వచ్చే సమ్మర్ లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.