సూపర్ స్టార్ మహేష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం సర్కార్ వారి పాట. పరశురామ్ దర్శకుడు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో కీర్తి సురేష్ కథానాయిక. మహేష్- పరశురామ్ అండ్ టీమ్ రెండేళ్లుగా ఈ సినిమాపై ఎంతో ఫోకస్ చేసి పని చేస్తున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు రిలీజ్ కి డేట్ ని ఫిక్స్ చేసుకుని వేచి చూస్తున్నారు. కరోనా వల్ల రిలీజ్ ఆలస్యమైన సంగతి తెలిసిందే.
అయితే ఆలస్యం అమృతం విషం! అన్నారు. ఇప్పుడు సర్కార్ వారి పాటకు ఇదే ప్రూవ్ అయ్యింది. తాజాగా సర్కార్ వారి పాట ఫస్ట్ సింగిల్ అధికారిక విడుదలకు ముందే సోషల్ మీడియాలో లీక్ అయింది. దీంతో దర్శకనిర్మాతలు బెంబేలెత్తారు. మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. వెంటనే వారు పోలీసులను సంప్రదించారు.
పాట లీకేజీకి సంబంధించి ఇద్దరు వ్యక్తులను గుర్తించి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు అప్పగించారు. వారిపై కేసు నమోదు చేసి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కాప్ ప్రామిస్ చేశారు. ప్రస్తుతం నిర్మాతలు ఇకపై ఎలాంటి లీక్ లు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.
లీకుల చరిత్ర చాలా పెద్దదే!
నిజానికి రిలీజ్ కి ముందే కంటెంట్ లీక్ అన్నది ఇప్పటి సమస్య కాదు. చిత్రబృందంలోనే ఎవరో ఒకరు లీకులివ్వడం ప్రతిసారీ పరిపాటిగా మారింది. పవన్ కల్యాణ్ అత్తారింటికి దారేది మొదటు సర్కార్ వారికి జరిగిన పరాభవం వరకూ లీకులకు బోలెడంత హిస్టరీ ఉంది. ఇటీవలి కాలంలో చాలా పెద్ద సినిమాల కంటెంట్ రిలీజ్ ముందే లీకైపోవడం నిర్మాతలను కలవరపాటుకు గురి చేసింది.
అత్తారింటికి దారేది సగం పైగా సినిమా లీకైపోతే.. ఆ తర్వాత ట్యాక్సీవాలా మూవీ మొత్తం లీకైంది. అంతకుముందు అరవింద సమేతకు సంబంధించిన కీలకమైన విజువల్స్ లీకవ్వడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ సర్కార్ వారి పాటకు ఈ సెగ తప్పలేదు. ఈ సినిమా నుంచి పాట విజువల్స్ లీకైపోయాయి. దీంతో థమన్ వంటి వారు తీవ్రంగా హర్టయ్యారు.
ఇకపోతే ఇలాంటి లీకులు లేకుండా చిత్రబృందాలు ఎందుకని జాగ్రత్తలు తీసుకోవడం లేదు! అన్నదే ఇప్పుడు ఒక మిస్టరీగా మారింది. చేతులు కాలాకే ఆకులు పట్టుకునేందుకే వీరంతా ఇష్టపడుతున్నారా? అంటూ దర్శకనిర్మాతలపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు కొందరు.