మెగాస్టార్ చిరంజీవి.. నందమూరి బాలకృష్ణల కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమాలు సంక్రాంతి రేసులో ఉన్నాయని తెలిసినా.. తన ప్రొడక్షన్లో వస్తున్న కొత్త సినిమా ‘శతమానం భవతి’ని అదే పండక్కి రిలీజ్ చేయాలని ఫిక్సయ్యాడు దిల్ రాజు. మధ్యలో రేసు నుంచి తప్పుకుంటాడేమో అనుకున్నారు కానీ.. అలాంటిదేమీ జరగలేదు. ఎప్పటికప్పుడు సంక్రాంతి రిలీజ్ అనే ప్రకటిస్తున్నాడు రాజు. టీజర్లోనూ ‘సంక్రాంతి విడుదల’ అనే పేర్కొన్నారు. మధ్యలో నాని సినిమా ‘నేను లోకల్’ను సంక్రాంతికి రిలీజ్ చేసి.. ‘శతమానం భవతి’ని వాయిదా వేస్తారన్న ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేమీ లేదన్నది తాజా సమాచారం.
ఆల్రెడీ ‘శతమానం భవతి’ సినిమా పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశకు వచ్చాయి. ఇటీవలే సినిమాను ఒకసారి చూసుకున్న దిల్ రాజు.. చాలా సంతృప్తిగా ఉన్నాడట. సంక్రాంతికి ఫ్యామిలీ ఎంటర్టైనర్లకు మంచి ఆదరణ ఉంటుందని.. చిరు.. బాలయ్య సినిమాలు వేరే తరహా సినిమాలు కాబట్టి.. ‘శతమానం భవతి’ కచ్చితంగా సంక్రాంతి రేసులో ఉండాల్సిందే అని దిల్ రాజు ఫిక్సయ్యాడట. ఔట్ పుట్ విషయంలో యూనిట్ అంతా కూడా కాన్ఫిడెంటుగా ఉన్నట్లు సమాచారం. ఇంతకుముందు రామదండు.. దొంగల బండి లాంటి చిన్న సినిమాలు తీసిన సతీశ్ వేగేశ్న ‘శతమానం భవతి’కి దర్శకుడు. దిల్ రాజు బేనర్లో కొన్ని సినిమాలకు రచయితగా పని చేసిన సతీశ్.. మూడేళ్ల ముందే ‘శతమానం భవతి’ స్క్రిప్టును ఆయనకు వినిపించాడు. అప్పటినుంచి ఈ స్క్రిప్టు మీద చాలా కాన్ఫిడెంటుగా ఉన్నాడు రాజు. సినిమాను మూడు నెలల్లో పూర్తి చేసేయడాన్ని బట్టి దర్శకుడికి ఆ స్క్రిప్టు మీద ఎంత పట్టుందో అర్థం చేసుకోవచ్చు. శర్వానంద్.. అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషించాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/