రానా బాబా? ఇదెక్కడి పేరు అనుకోవాల్సిన అవసరం లేదు. రానా అంటే ఇంకెవరు రీల్ లైఫ్ భళ్లాల దేవుడు. ఇక.. బాబు అంటే రియల్ లైఫ్ చంద్రబాబు. రియల్ బాబు పాత్రను రీల్ భళ్లాల దేవుడు పోషిస్తున్న సంగతి తెలిసిందే. భళ్లాలదేవుడి క్యారెక్టర్ లో పరకాయ ప్రవేశం పోషించి.. భారీ విలనిజాన్ని పోషించిన రానా.. ఇప్పుడు రీల్ చంద్రబాబు పాత్రను చేసేందుకు ఓకే చెప్పటంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
వినాయకచవితి సందర్భంగా ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించి.. చంద్రబాబు గెటప్ తో కూడిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. 80ల నాటి చంద్రబాబును గుర్తుకు తెచ్చేలా రానా గెటప్ వచ్చేలా జాగ్రత్తలు తీసుకున్నారు. హెయిర్ స్టైల్.. మీసకట్టును అనుకరించటంలో సక్సెస్ అయ్యారు.
ఈ ఫస్ట్ లుక్ మీద పాజిటివ్ వ్యాఖ్యల కంటే పంచ్ లతో ట్రోలింగ్ ఎక్కువ కావటం గమనార్హం. రానీ లుక్ వరకు ఓకే అయినా.. అతగాడు పోసిస్తున్న చంద్రబాబు పాత్రపైన సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న పంచ్ లు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
భళ్లాలదేవుడి లాంటి భయంకరమైన విలన్ పాత్రను పోసించిన రానా.. తన కెరీర్ లో మరో భయంకరమైన విలన్ పాత్రకు రెఢీ అయ్యాడంటూ ఫస్ట్ లుక్ స్టిల్ పై కామెంట్ ఒకటి పడగా.. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి సీఎం పదవిని చేప్టటిన వైనాన్ని పలువురు ప్రస్తావించటం గమనార్హం. ఈ పంచ్ ల సంగతి కాసేపు పక్కన పెట్టి.. స్టిల్ చూస్తే.. బాబు హైటుకు తగ్గట్లే రానా హైట్ ఉండటం.. మేకప్ టచ్ అప్ లతో మేనేజ్ చేశారని చెప్పాలి.
మరి.. బాబు మాదిరి నడక.. ఆయన బాడీలాంగ్వేజ్ ను రానా ఎంతవరకు పండిస్తారన్నది ప్రశ్నగా చెప్పక తప్పదు. ఇదిలా ఉంటే.. బాబు నవ్వును రానా ఎలా అనుకరిస్తారన్నదానిపై బోలెడంత చర్చ నడుస్తోంది. బాబులా నవ్వటం.. బాబులా కన్నింగ్ గా చూడటంలో రానా ఎందుకు పనికిరాదంటూ ఒక పంచ్ పడితే.. వెన్నుపోటు వాస్తవాలు తెలిసి మరీ బాబు పాత్రను రానా ఎందుకు ఒప్పుకున్నట్లు? అన్న ప్రశ్నను మరొకరు సంధించారు.
ఈ స్టిల్ పై సోషల్ మీడియాలో బోలెడన్ని ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి. ఇది నెగిటివ్ క్యారెక్టరా లేదంటే పాజిటివ్ పాత్రా అన్న దానిపై ఎట్టి పరిస్థితుల్లో నెగిటివ్ ఉండదని చెబుతున్నారు. అయినా.. సినిమా చేస్తున్నదే బాబు వియ్యంకుడు బాలకృష్ణ. చూస్తూ.. చూస్తూ వియ్యంకుడిని బాలయ్య దెబ్బేయలేరు కదా? మొత్తానికి రానాబాబు ఫస్ట్ లుక్ మీద పాజిటివ్ కామెంట్స్ కంటే పంచ్ లే ఎక్కువగా ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.