గతవారం విడుదలైన థ్రిల్లర్ మూవీ 'మలుపు' మంచి కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ చిత్రంలో హీరోగా నటించిన ఆది పినిశెట్టి.. ఒకనాటి దర్శకుడు రవిరాజా పినిశెట్టి చిన్న కొడుకు. అలాగా మలుపు చిత్రానికి దర్శకత్వం వహించినది రవిరాజా పెద్ద కుమారుడు సత్య ప్రభాస్ పినిశెట్టి. తొలి చిత్రంతోనే తెలుగులో మంచి హిట్ సాధించడంతో ఇప్పుడీ దర్శకుడు మంచి ఉత్సాహంతో ఉన్నాడు.
తన స్నేహితులకు ఎదురైన ఓ అనుకోని సంఘటన ఆధారంగా, సినిమాటిక్ ట్విస్ట్ లను జోడించి ఈ సినిమా స్క్రిప్ట్ రాసుకున్నట్లు చెబుతున్నాడు సత్యప్రభాస్. 'తండ్రి బాటలో నడవాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. 2002లో ఎంబీఏ పూర్తి చేశాను. కానీ రెండేళ్ల తర్వాత సినిమాలకే మొగ్గు చూపాను. దర్శకత్వం వహించాలనే ఆలోచన నాన్నకి చెబితే.. ముందు ఫీల్డ్ గురించి తెలుసుకోమన్నారు. అలా చాలా చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాను' అని చెప్పిన సత్యప్రభాస్.. మలుపు కి స్క్రిప్ట్ పూర్తయిన తర్వాత తండ్రి అసలు పట్టించుకోలేదని చెప్పాడు.
ఈ మూవీలో విలన్ గా నటించిన మిథున్ చక్రవర్తి.. ఇదే చిత్రాన్ని హిందీలో తన కొడుకుతో తీయాల్సిందిగా కోరాడట. అయితే కొత్త స్క్రిప్ట్ తో వస్తానని ప్రామిస్ చేసినట్లుగా చెప్పాడు సత్యప్రభాస్. లాస్ ఏంజెల్స్ లో ఓ ఫిలిం ఇనిస్టిట్యూట్ లో చేరినపుడు.. ఆస్కార్ నామినీలను ఎంపిక చేసే కమిటీ.. ఎనిమిది మంది స్టూడెంట్స్ ను స్కాలర్ షిప్ కు సెలెక్ట్ చేయగా.. వారిలో ఒకే ఒక్క ఇండియన్ సత్యప్రభాస్ కావడం విశేషం.