పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని వెండితెరపై చూడటానికి అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. పవన్ మూడేళ్ళ గ్యాప్ తర్వాత ''వకీల్ సాబ్'' సినిమాతో ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బోనీ కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు - శిరీష్ కలసి నిర్మిస్తున్నారు. ఇది హిందీలో అమితాబ్ నటించిన 'పింక్' చిత్రానికి రీమేక్. పవన్ ఇందులో లాయర్ గా కనిపిస్తున్నాడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో చిత్రంలోని రెండో పాట 'సత్యమేవ జయతే' లిరికల్ వీడియోని చిత్ర యూనిట్ బుధవారం విడుదల చేసింది.
'జన జన జన జనగమున కలగలిసిన జనం మనిషి రా.. మన మన మన మనతరపున నిలబడగలిగే నిజం మనిషి రా' అంటూ సాగిన ఈ గీతానికి థమన్ స్వరాలు సమకూర్చాడు. ప్రముఖ సింగర్ శంకర్ మహదేవన్ మరియు పృథ్వీ కలిసి తమదైన శైలిలో ఆలపించారు. 'వదలనే వదలడు ఎదురుగా తప్పు జరిగితే.. గుండెతో స్పందిస్తాడు.. అండగా చెయ్యందిస్తాడు' అంటూ లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి మంచి సాహిత్యం అందించారు. ఇది సినిమా కోసమే కాకుండా పవన్ కళ్యాణ్ రాజకీయ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని రాసినట్లు అనిపిస్తుంది. పీకీ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈ సాంగ్.. విడుదలైన కొన్ని నిమిషాల్లోనే రికార్డ్ స్థాయి వ్యూస్ రాబడుతోంది. సిద్ శ్రీరామ్ పాడిన 'మగువా మగువా' సాంగ్ తరహాలోనే ఇది కూడా చార్ట్ బ్లస్టర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
'వకీల్ సాబ్' చిత్రానికి తిరు డైలాగ్స్ రాస్తుండగా.. పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించాడు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కి జోడీగా శృతి హసన్ నటించింది. నివేధా థామస్ - అంజలి - అనన్య - ప్రకాష్ రాజ్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. సమ్మర్ స్పెషల్ గా వస్తున్న 'వకీల్ సాబ్' ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
Full View