అశ్లీల చిత్రాల కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త- వ్యాపారవేత్త రాజ్ కుంద్రాకు ఎట్టకేలకు సుప్రీంకోర్టు నుంచి కొంత ఊరట లభించింది. రాజ్ కుంద్రాతో పాటు మోడల్స్ షెర్లిన్ చోప్రా- పూనమ్ పాండే- ఉమేష్ కామత్ లకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అదే సమయంలో అవసరమైతే విచారణకు సహకరించాలని నిందితులందరినీ కోర్టు కోరింది. అసభ్యకర కంటెంట్ ని తయారు చేసి OTT ప్లాట్ ఫామ్ లో విడుదల చేసిన కేసులో ఆ ముగ్గురికి ఇది అతిపెద్ద ఊరట.
గత నెలలో మహారాష్ట్ర సైబర్ పోలీసులు అశ్లీల చిత్రాల కేసులో రాజ్ కుంద్రా- షెర్లిన్ చోప్రా- పూనమ్ పాండేలపై ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ముంబై చుట్టుపక్కల ఉన్న ఫైవ్ స్టార్ హోటళ్లలో రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాలను చిత్రీకరించాడని ఆపై వాటిని ఓటీటీ ప్లాట్ ఫారమ్ లకు విక్రయించాడని ఛార్జిషీట్ పేర్కొంది.
రాజ్ కుంద్రా ఈ డీల్ విలువ కోట్లాది రూపాయలుగా ఉందని కూడా ఛార్జ్ షీట్ లో పేర్కొంది. పూనమ్- షెర్లిన్ లతో రాజ్ ఈ చిత్రాలను తెరకెక్కించాడని బలంగా ఆరోపించింది సీబీఐ.
రాజ్ కుంద్రాపై చార్జిషీటు దాఖలైన తర్వాత ఆయన లాయర్ వాంగ్మూలం తెరపైకి వచ్చింది. ఈ విషయం తనకు మీడియా ద్వారానే తెలిసిందని చట్ట ప్రకారం కోర్టుకు హాజరైన తర్వాత చార్జిషీట్ కాపీని తీసుకుంటానని లాయర్ తెలిపారు. అంతే కాదు మీడియా కథనాలతో కానీ.. ఎఫ్.ఐ.ఆర్ లో ఉన్న ఆరోపణలతో కానీ తన క్లయింట్ కు ఎలాంటి సంబంధం లేదని న్యాయవాది చెప్పారు.
మొబైల్ అప్లికేషన్ లో అసభ్యకరమైన సినిమాలు తీసి అప్ లోడ్ చేసినందుకు గత ఏడాది జూలైలో రాజ్ కుంద్రాను అరెస్టు చేశారు. ఆ తర్వాత జైలులో ఉన్న అతను రెండు నెలల తర్వాత బెయిల్ పొందాడు. మరోవైపు శిల్పాశెట్టి ఈ విషయంలో పెదవి విప్పలేదు. తొలి నుంచి తన భర్తకు మద్ధతుగా నిలిచింది. ఈ జంట విడిపోతారన్న పుకార్లకు కూడా చెక్ పెట్టారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.