మెగాస్టార్ చిరంజీవి- సల్మాన్ ఖాన్ కాంబినేషన్ లో విజువల్ ట్రీట్ ని వీక్షించే అవకాశం చాలా అరుదు. ఆ ఇద్దరి నడుమా దశాబ్ధాలుగా స్నేహం ఉన్నా కానీ కలిసి పని చేసేందుకు ఇంతకాలానికి అవకాశం చిక్కింది. చిరు- సల్మాన్ జోడీ మోహన్ రాజా తెరకెక్కిస్తున్న రీమేక్ చిత్రం గాడ్ ఫాదర్ లో నటిస్తున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి పై అటామ్ బాంబింగ్ స్వింగింగ్ పాటను తెరకెక్కించనున్నారు. ఈ పాటకు ప్రభుదేవా కొరియోగ్రాఫీ అందిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ- సూపర్ గుడ్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ అద్భుతమైన పాత్రతో అలరించనున్నారు. భాయ్ కెరీర్ లో తొలి తెలుగు సినిమా ఇది. తాజాగా చిరంజీవి- సల్మాన్ ఖాన్ లపై తెరకెక్కించే పాట ట్రెండ్ సెట్ చేయడం ఖాయమన్న చర్చా సాగుతోంది. ఈ స్పెషల్ డ్యాన్స్ నంబర్ కు కొరియోగ్రఫీ ప్రభుదేవా అందిస్తుండగా.. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.
ఇదే విషయాన్ని తెలియజేస్తూ తమన్ ట్వీట్ చేసారు. ``అయ్యా!! ఇదీ వార్త. త్వరలోనే ఈ పాటను చిత్రీకరించనున్నారు మేకర్స్. ఏది ఏమైనప్పటికీ చిరంజీవి- సల్మాన్ ఖాన్ కలిసి డ్యాన్స్ చేయడం వారి అద్భుతమైన డ్యాన్స్ కదలికలతో స్క్రీన్ లను తగలబెట్టడం అభిమానులకు కన్నుల పండుగ అవుతుంది.. అంటూ వ్యాఖ్యను థమన్ జోడించారు.
థమన్ షేర్ చేసిన ఫోటోలో చిరంజీవితో పాటు మోహన్ రాజా- ప్రభుదేవా ఉన్నారు. గాడ్ ఫాదర్ షూటింగ్ చివరి దశలో ఉంది. నయనతార కీలక పాత్రలో నటిస్తుండగా.. పూరి జగన్నాధ్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. సత్యదేవ్ కూడా ఈ సినిమాలో పూర్తి నిడివి పాత్రను పోషిస్తున్నాడు.
అగ్రశ్రేణి టెక్నికల్ టీమ్ సినిమాకు సంబంధించిన విభిన్నమైన క్రాఫ్ట్ లను హ్యాండిల్ చేస్తున్నారు. మాస్టర్ సినిమాటోగ్రాఫర్ నీరవ్ షా కెమెరాను హ్యాండిల్ చేస్తుండగా.. ఇన్-ఫార్మ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్ థమన్ సౌండ్ ట్రాక్ లను అందిస్తున్నారు.
అనేక బాలీవుడ్ బ్లాక్‌బస్టర్స్ కి ఆర్ట్ డైరెక్టర్ గా పని చేసిన సురేష్ సెల్వరాజన్ ఈ సినిమా ఆర్ట్ వర్క్ ని అందిస్తున్నారు. కొణిదెల సురేఖ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్.బి చౌదరి- ఎన్.వి ప్రసాద్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. స్క్రీన్ ప్లే & దర్శకత్వం: మోహన్ రాజా..నిర్మాతలు: RB చౌదరి & NV ప్రసాద్.
ఈ చిత్రంతో పాటు మెగాస్టార్ మరో రెండు సినిమాలతోనూ బిజీగా ఉన్నారు. వాటికి బాబి .. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. మెహర్ రమేష్ చిత్రానికి భోళా శంకర్ అనే టైటిల్ ని ప్రకటించగా.. బాబి చిత్రానికి వాల్తేర్ వీరన్న అనే టైటిల్ ప్రముఖంగా వినిపిస్తోంది.