సీట్ బెల్ట్ తో అమీ తుమీ

Update: 2017-06-12 11:07 GMT
సీట్ బెల్ట్ పెట్టుకోమంటే జనాలకు రకరకాల ఫీలింగ్స్ చెబుతారు. సేఫ్టీ ప్రికాషన్ గా వారి శ్రేయస్సు కోసమే చెప్పినా అర్ధం చేసుకోరు. సీట్ బెల్ట్ పెట్టుకోక ప్రాణాలు పోగొట్టుకున్న ప్రముఖుల సంఖ్య చాలానే ఉంటోంది. కానీ సీట్ బెల్ట్ కారణంగా.. ప్రాణాలు దక్కించుకున్నాడు అమీ తుమీ దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ.

ఇది ఇప్పుడు జరిగినది కాదు.. నానితో జెంటిల్మెన్ మూవీ తీసిన సమయంలో ఇంద్రగంటి చాలానే కష్టపడ్డాడు. అప్పటివరకూ ఫ్లాప్స్ లో ఉండడంతో.. ఆ మూవీతో ఎలాగైనా సక్సెస్ సాధించాలనే పట్టుదలతో అర్ధరాత్రి వరకూ వర్క్ చేశాడాయన. అలాంటి సమయంలోనే ఓ రోజున బాగా లేట్ అయిపోయిందట. కాసింత నిద్ర మత్తులో ఉన్నా.. కార్ తీసి ఇంటికి వెళుతున్న సమయంలో కునుకు పట్టేయడంతో.. మెట్రో పిల్లర్ కు గుద్దేశాడట. అప్పుడు కారుకు బాగానే యాక్సిడెంట్ అయినా.. ఇంద్రగంటి మాత్రం స్వల్ప గాయాలతో తప్పించుకున్నాడట.

సీట్ బెల్ట్ పెట్టుకోవడం.. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతోనే యాక్సిడెంట్ ను బయటపడ్డట్టు రీసెంట్ గా ఓ సందర్భంలో చెప్పాడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ. సీట్ బెల్ట్ పెట్టుకోవడంతో పాటు భద్రతా ప్రమాణాలు ఎంత అవసరమో చెప్పాడాయన. ఆ తర్వాత ప్రపంచంలోనే అత్యధిక సేఫ్టీ స్టాండర్డ్స్ ఉన్నట్లుగా గుర్తింపు పొందిన బీఎండబ్ల్యూ కార్ కు మారాడట అమీ తుమీ దర్శకుడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News