రాజా వారు రాణి గారు మరియు ఎస్ ఆర్ కళ్యాణ మండపం సినిమాలతో హీరోగా మంచి గుర్తింపు దక్కించుకున్న కిరణ్ అబ్బవరం త్వరలో సెబాస్టియన్ పీసీ524 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఫస్ట్ లుక్ మరియు టైటిల్ సినిమా పై ఆసక్తి మరియు అంచనాలు పెంచే విధంగా ఉన్నాయి అంటూ టాక్ వినిపిస్తుంది. మొదటి రెండు సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ సినిమా పై సహజంగానే అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా సెబాస్టియన్ ను మేకర్స్ తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా తో కిరణ్ అబ్బవరం నటుడిగా మరో మెట్టు ఎక్కబోతున్నట్లుగా కూడా మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
సెబాస్టియన్ సినిమా ను ఈనెల 25న థియేటర్లలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. కాస్త పోటీ అధికాంగా ఉన్నా కూడా సినిమా పై నమ్మకంతో అదే తేదీని ఫిక్స్ చేసినట్లుగా మేకర్స్ చెబుతున్నారు. సినిమాకు ఉన్న బజ్ నేపథ్యంలో ఈ సినిమా ను దక్కించుకునేందుకు పలు ఓటీటీ సంస్థలు ముందుకు వచ్చాయట. ఈ సినిమా ను తీవ్ర పోటీ మద్య ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహా దక్కించుకుంది. థియేటర్ రిలీజ్ తర్వాత కనీసం నాలుగు వారాల తర్వాత స్ట్రీమింగ్ చేసే ఒప్పందంతో ఆహా వారికి ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ను సెబాస్టియన్ మేకర్స్ ఇవ్వడం జరిగింది.
ఒక నిజాయితీ గల పోలీసు పాత్రతో ఈ సినిమా రూపొందినట్లుగా తెలుస్తోంది. ట్రైలర్ ఆకట్టుకోవడంతో సినిమా పై ఆసక్తి పెరిగింది. కిరణ్ అబ్బవరం ఇప్పటి వరకు చేసిన పాత్రలకు ఈ పాత్ర పూర్తి విభిన్నంగా ఉంటుంది. ఏ హీరోకు అయినా పోలీస్ పాత్ర అంటే ఖచ్చితంగా ఛాలెంజ్ అనడంలో సందేహం లేదు. మరి సెబాస్టియన్ గా కిరణ్ అబ్బవరం ఎలాంటి ఛాలెంజ్ లను ఎదుర్కొన్నాడు.. ఈ సినిమా తో ఆయనకు దక్కేది ఏంటీ అనేది తెలియాలంటే సినిమా విడుదల వరకు వెయిట్ చేయాలి. థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఆహా లో స్ట్రీమింగ్ అవ్వబోతుంది కనుక ఖచ్చితంగా ఎక్కువ శాతం మంది ఈ సినిమాను ఆధరించే అవకాశాలు ఉన్నాయంటున్నారు.