పవర్ స్టార్ సినిమా రికార్డులకు ఇలాంటివి బ్రేక్స్ వేయగలవా..?

Update: 2021-04-03 08:30 GMT
పవన్ కళ్యాణ్ మూడేళ్ల తర్వాత వెండితెరపైకి వస్తున్న 'వకీల్ సాబ్' కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల థియేటర్స్ లో ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ఏ రేంజ్ లో హడావిడి చేశారో చూశాం. వారి నిరీక్షణకు ఏప్రిల్ 9న తెరపడనుంది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక స్క్రీన్స్ లో ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రికార్డ్ స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టేలా బెనిఫిట్ షోలతో పాటుగా ఎర్లీ మార్నింగ్ షో లు ఏర్పాటు చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై అభిమానులు సంతోషంగా ఉన్నా కోవిడ్ నేపథ్యంలో ఇది సాధ్యపడతాయో లేదో అనే ఆందోళన చెందుతున్నారు.

దేశవ్యాప్తంగా వాక్సినేషన్ అందుబాటులోకి వచ్చినా కరోనా కేసులు ఎప్పటిలాగే నమోదవుతున్నాయి. దీంతో ఇప్పటికే ఇతర ఇండస్ట్రలలో సినిమాలు వాయిదా వేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. అయితే తెలంగాణా మినిస్టర్ థియేటర్స్ మూతపడవని.. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సినిమాలు ప్రదర్శించేలా చూస్తామని స్పష్టత ఇచ్చారు. ఈ నేపథ్యంలో కరోనా పరిస్థితుల దృష్ట్యా 100 శాతం సీటింగ్ ఆక్యుపెన్సీ నుంచి మళ్ళీ 50 శాతానికి తగ్గిస్తారని.. ఈ ప్రభావం 'వకీల్ సాబ్' పై పడుతుందని రూమర్స్ వస్తున్నాయి.

అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం 'వకీల్ సాబ్' రికార్డులను ఇలాంటివేవీ ఆపలేవని ధీమాగా ఉన్నారు. కరోనా లాక్ డౌన్ తర్వాత రవితేజ నటించిన 'క్రాక్' సినిమా బెనిఫిట్ షోలు లేకుండా.. 50 శాతం ఆక్యుపెన్సీతోనే బ్లాక్ బస్టర్ అయిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ మధ్య కంటెంట్ ఉన్న చిన్న సినిమాలు సైతం లాంగ్ రన్ లో మంచి వసూళ్ళు రాబట్టాయని.. అలాంటిది పవర్ స్టార్ సినిమాకి ఎదురుదెబ్బలు తగులుతాయని అనుకోవడం హాస్యాస్పదంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ నటించిన 'వకీల్ సాబ్' సినిమాని ఏదీ ఆపలేదని.. ఆపకూడదని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.
Tags:    

Similar News