మెగా డాటర్ నిహారిక పెళ్లి తర్వాత మరింత జాయ్ ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. వివాహమై నెల రోజులు తిరగకుండానే.. కెమెరా ముందుకు వచ్చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక, సోషల్ మీడియాలో మునుపటికన్నా ఎక్కువగా యాక్టివ్ గా ఉంటున్నారు. తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ గురించి అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు.
లేటెస్ట్ గా.. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో ఆమె షేర్ చేసిన ఓ పోస్టు ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఇందులో ఒక ఫొటో పోస్ట్ చేసిన నిహారిక.. అందులోని సీక్రెట్ మాత్రం 'అతనొక్కడికే తెలుసు' అని పేర్కొంది! కావాలనే.. నెటిజన్లలో సస్పెన్స్ క్రియేట్ చేయాలని భావించిన నిహారిక.. ఈ ఫన్నీ కామెంట్ చేశారు. మరి, ఇంతకీ ఆ పోస్టులో ఏముందంటే..?
ఆ పోస్టులో.. సెంటర్ ఫ్రెష్ యాడ్‌లో మాదిరి నోటికి తాళం వేసుకున్న నిహారిక మనకు కనిపిస్తున్నారు. ఈ ఫొటోకి క్యాప్షన్ గా.. ''నేను ఆ సీక్రెట్ చెప్పను.. ఒకవేళ చెప్తే అది సీక్రెట్ ఎలా అవుతుంది?' అంటూ చిలిపిగా ప్రశ్నించింది కొణిదెల వారసురాలు. అయితే.. ఆ సీక్రెట్ గురించి తెలుసుకోవాలంటే ఏం చేయాలో మాత్రం హింట్ ఇచ్చారు నిహారిక.
'ఆ సీక్రెట్ .. జోసెఫ్ రాధిక్ ఒక్కడికే తెలుసు' అని పోస్టులో చెప్పారు నిహారిక. అసలింతకీ ఈ జోసెఫ్ రాధిక్ ఎవరు అనుకుంటున్నారా? ఆయన మరెవరో కాదు.. నిహారిక-చైతన్య పెళ్లి ఫొటోలను తీసిన ఫొటో గ్రాఫర్. తనదైన సృజనాత్మకతో తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఆ సంగతి అటుంచితే.. ఇంతకూ ఈ ఫొటోగ్రాఫర్‌కు మాత్రమే తెలిసిన ఆ రహస్యం ఏమై ఉంటుందా.. అని నిహారిక అభిమానులు, నెటిజన్లు బుర్ర బద్ధలు కొట్టుకుంటున్నారు. మరి, ఇంతకీ.. ఎవరికైనా తెలిసిందో..?