పాపం కమ్ముల.. కోట్లు పోగొట్టుకున్నాడు

Update: 2017-09-04 09:41 GMT
ఒక్కోసారి ఎంత మంచి సినిమా తీసినా కూడా డబ్బులు రావు. ఒక్కోసారి మంచి సినిమా కత్తిలా ఆడినా కూడా డబ్బులు రావు. అదెలా అంటారా.. అదిగో అందుకు మనం చాలా ఉదాహరణలే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ శేఖర్ కమ్ముల మ్యాటర్ చెప్పుకోవాలంటే మాత్రం.. ఆయన రెండుసార్లు బ్లాక్ బస్టర్లు తీస్తే.. ఆ రెండుసార్లు ఆయనకు మాత్రం పైసా కూడా మిగల్లేదు. అదే ఇండస్ర్టీ టాక్. పదండి చూద్దాం.

నిజానికి 'హ్యాపీ డేస్' సినిమా తీసినప్పుడు.. శేఖర్ కమ్ముల ఇంకా స్టార్ కాదు. కాకపోతే ఆనంద్ అనే ఒక మీనింగ్ ఫుల్ సినిమా తీశాడనే టాక్ ఉంది. ఆ తరువాత మనోడు సొంత డబ్బులతో హ్యాపీ డేస్ సినిమాను అందరూ కొత్త ముఖాలతో తీసినా.. రిలీజయ్యాక ఫలితం ఎలా ఉంటుందోననే డౌట్ ఉంది. దానితో సినిమా మొత్తాన్ని దిల్ రాజుకు అమ్మేశాడట. ఆ సినిమా చూస్తే ఫుల్ రన్ లో ఒక 10 కోట్లు లాభం తెచ్చి ఉంటుంది కాని.. కమ్ములకు మాత్రం ఒక కోటికి మించి గిట్టలేదని టాక్. కట్ చేస్తే.. చాలా ఫ్లాపులు తీసిన తరువాత సొంతంగా సినిమా తీయాలంటే శేఖర్ కు కొంత కష్టమే. పైగా తనే స్వయంగా వెళ్ళి కథ చెబితే.. మహేష్‌ బాబు అండ్ చరణ్‌ వంటి హీరోలు రిజక్ట్ చేశారు.

అందుకే 'ఫిదా' సినిమాను దిల్ రాజుకు నెరేట్ చేసి.. ఆయన ద్వారా వరుణ్ తేజ్ ను ఎప్రోచ్ అయ్యాడు కమ్ముల. కట్ చేస్తే సినిమాకు ఇప్పుడు రమారమీ 50 కోట్ల వరకు షేర్ వచ్చింది. ఇందులో శేఖర్ కు రెమ్యూనరేషన్ తప్పించి లాభాల్లో వాటా ఏమీ లేదంట. అలా చూసుకుంటే.. రెండుసార్లు బ్లాక్ బస్టర్ కొట్టినా కూడా.. ఈయనకు మాత్రం కోట్లలో మిగల్లేదు. ఏమంటారు మరి?
Tags:    

Similar News