పాన్ ఇండియన్ సినిమా కాన్సెప్ట్ తో ప్రతిదీ మారిపోయింది. కాంబినేషన్ ని బట్టి ముందే పారితోషికాలు ఫిక్స్ అయిపోతున్నాయి. మల్టీస్లారర్ హీరోలు.. దర్శకులు భారీ పారితోషికాలార్జిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్ మల్టీస్టారర్లతో పారితోషికాలు చుక్కల్ని చూపిస్తుస్తున్నాయన్నది వాస్తవం. తాజాగా అలాంటి క్రేజీ కాంబినేషనే కోలీవుడ్ సహా టాలీవుడ్ ని కూడా హీటెక్కిస్తోంది. తమిళస్టార్ హీరో ధనుష్.. శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో ఓ క్రేజీ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
త్రిభాషా చిత్రంగా ఈ మూవీని ప్లాన్ చేస్తున్నారు. ధనుష్ మాతృభాష తమిళ్ సహా హిందీలోనూ అతనికి మంచి డిమాండ్ ఉంది. ఇక తెలుగులో కూడా ధనుష్ చిత్రాలు ఇటీవల వరుసగా రిలీజ్ అవ్వడం.. రీచ్ ఎక్కువగా ఉండటంతో మినిమం వసూళ్లు వచ్చేస్తున్నాయి. దీంతో ఈ చిత్రాన్ని మూడు భాషల్లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. పైగా ఈ సినిమా డైరెక్ట్ చేస్తున్నది శేఖర్ కమ్ముల కావడం..ఆయన సినిమాలకు ప్రత్యేకమైన అభిమానులు ఇక్కడ ఉండటం ధనుష్ కు మార్కెట్ పరంగా కలిసొచ్చే అంశమే. కాబట్టి తెలుగులోనూ బిగ్ స్కేల్ లో రిలీజ్ చేసే వీలుంది. ఈ నేపథ్యంలో ధనుష్ భారీగా పారితోషికం తీసుకుంటున్నట్లు విశ్వ సనీయ సమాచారం.
మూడు రాష్ట్రాల మార్కెట్ కాబట్టి అన్నింటికి కలిపి మూడు రెట్లు పెంచి ఛార్జ్ చేస్తున్నట్లు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. నిజానికి అతడు డిమాండ్ చేసిన ఫిగర్ ధనుష్ కి కాస్త ఎక్కువ అనే విమర్శ ఉంది. ఆయన గత సినిమా `జగమే తంత్రం` 17 భాషల్లో 190 దేశాల్లో రిలీజ్ అయింది. కానీ సినిమా ఫ్లాప్ గా నిలిచింది. ఈ సినిమాకు ధనుష్ తీసుకున్న పారితోషికం తక్కువే. కానీ శేఖర్ కమ్ములా సినిమా కోసం ఎవరూ ఊహించని పారితోషికం ఛార్జ్ చేయడం ఇప్పుడంతా హాట్ టాపిక్ గా మారింది. సుమారు 50కోట్ల వరకూ అతడు ఛార్జ్ చేస్తున్నారన్న గుసగుసా వినిపిస్తోంది. ఇందులో హీరోయిన్ గా సాయి పల్లవినే తీసుకోవాలని శేఖర్ కమ్ములా డిసైడ్ అయినట్లు సమాచారం.