పెద్ద తెరను మించి ఓటీటీ ట్రీట్ ఎక్కువగా చర్చకు వస్తోంది. రొటీన్ కథలకు భిన్నంగా ప్రయోగాలకు స్కోప్ ఉండడమే ఇందుకు కారణం. నవతరం దర్శకులు తమలో సృజనాత్మకతను ప్రెజెంట్ చేసేందుకు వైవిధ్యాన్ని వినోదాన్ని గొప్ప ప్రమాణాలతో ప్రేక్షకులకు అందించేందుకు ప్రయత్నించే గొప్ప ప్రయోగశాలగా ఓటీటీ లు మారుతున్నాయి. ఆహా- తెలుగు ఓటీఈలో ఈ తరహా కంటెంట్ కి కొదవేమీ లేదు.
ఈనెల 31 నుంచి సేనాపతి సిరీస్ తో సరికొత్త ట్రీట్ ఇవ్వనుంది ఆహా. తాజాగా సేనాపతి ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ ఆద్యంతం థ్రిల్స్ ఇంట్రెస్టింగ్. మిస్టరీ కాప్ .. డ్రామా రక్తి కట్టిస్తున్నాయి. ఇక ఇందులో సేనాపతి కథేమిటి.. ఆ పాత్రతో ముడిపడిన ట్విస్టులేమిటి? అన్నది 31న ప్రీమియర్స్ తో క్లారిటీ వస్తుంది. బ్యాంకులో జొరబడి గన్ తో బెదిరించి.. మిస్టీరియస్ గా ప్రవర్తిస్తూ.. కొట్టేసిన డబ్బు ను వీధుల్లో గాల్లోకి ఎగరేస్తూ .. పోలీసోడి గన్ కొట్టేసి చాలా చేస్తున్నాడు సేనాపతి. అసలిదంతా బట్టతల ఏజ్డ్ సేనాపతి ఎందుకని చేస్తున్నట్టు...? ఇంతకీ పోలీసాయన గన్ దొరికిందా లేదా? ప్రతిదీ ట్రైలర్ లో మిస్టీరియస్ గా కనిపిస్తున్నాయి.
ఈ సేనాపతి చాలా పెద్ద గ్యాంబ్లర్ లా ఉన్నాడే! అన్న సందేహాలు కలగక మానవు. అయితే ప్రతి గ్యాంబ్లింగ్ వెనక ఒక కథ ఉంటుంది. కారణం ఉంటుందని చూపడమే సేనాపతిలో అసలు ట్విస్టు అనుకోవచ్చు . సేనాపతి పాత్రలోకి నటకిరీటి రాజేంద్రప్రసాద్ ఎంతో ఒదిగిపోయి నటించారు. ఇతర తారాగణం ఎవరి పాత్రలో వారు ఒదిగిపోయారు.
రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రధారిగా చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత నిర్మించిన ఓటీటీ సినిమా ఇది. పవన్ సాధినేని దర్శకత్వం వహించాడు. సావిత్రి-ప్రేమ ఇష్క్ కాదల్ లాంటి సినిమా తరవాత అతడి నుంచి వస్తున్న చిత్రమిది. జీవితంలో మంచి - చెడు రెండూ చూడాలి. ఆ రెండింటి మధ్యే ఎదగాలి అనే డైలాగ్ తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం రక్తి కట్టించింది. కృష్ణమూర్తి .. సేనాపతిగా ఎందుకు మారాడన్నది ప్రీమియర్ లో చూడాలి.
Full View