కంగనా కామెంట్స్ పై సీనియర్ నటుడు సంచలన వ్యాఖ్యలు

Update: 2021-11-24 06:37 GMT
బాలీవుడ్‌ హీరోయిన్‌, వివాదాస్పద నటి కంగనా రనౌత్‌ సంచలన వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. 1947లో భారత్‌ కు లభించింది స్వాతంత్య్రం కాదు భిక్ష అని.. మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకొచ్చాక 2014లో నిజమైన స్వాతంత్య్రం వచ్చిందని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అన్ని వైపుల నుండి విమర్శలు ఎదుర్కొన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యల వీడియో క్లిప్పింగ్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యాయి. దీంతో ఆమెపై దేశవ్యాప్తం గా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 1947లో భారత్‌కు వచ్చింది స్వాతంత్య్రం కాదు. భిక్ష మాత్రమే, ఆ విధంగా దొరికిన దాన్ని స్వాతంత్య్రంగా పరిగణిస్తామా, ఇన్నాళ్లూ కాంగ్రె స్‌ హయాంలో బ్రిటిష్‌ పాలన కొనసాగింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014లో భారత్‌ కు నిజమైన స్వాతంత్య్రం వచ్చింది అని తెలిపింది.

పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఈ విషయంలో కంగనా పై ఫైర్ అయ్యారు. అలాగే కంగనాపై హైదరాబాద్ తో పాటు పలు చోట్ల కేసుకు కూడా నమోదు అయ్యాయి. ఈ వివాదం ఇంకా చల్లారలేదు. తాజాగా కంగనా స్వాతంత్య్రం భిక్ష అంటూ చేసిన వ్యాఖ్యలపై సీనియర్ నటుడు ముఖేష్ ఖన్నా స్పందించారు. కంగనా ఇచ్చిన స్టేట్మెంట్ హాస్యాస్పదంగా, చిన్న పిల్లల చేష్టల్లా ఉందని పేర్కొన్నాడు. ఇది అజ్ఞానాన్ని ప్రతిబింబిస్తుందా లేదా పద్మ అవార్డు దుష్ప్రభావమా, అని ఆయన ప్రశ్నించారు. ముఖేష్ ఖన్నా ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ మేరకు ఓ పోస్టును పంచుకున్నారు. అందులో కంగనా ఫోటోను షేర్ చేస్తూ దేశ స్వాతంత్య్రం పై మీరు చేసిన వ్యంగ్యంపై వ్యాఖ్యానించలేదని చాలా మంది నన్ను పదే పదే అడుగుతున్నారు.

నా ప్రకారం ఈ ప్రకటన చిన్నపిల్లల చేష్టల్లా, హాస్యాస్పదంగా ఉంది. ఇది ముఖస్తుతి. ఇది అజ్ఞానానికి నిదర్శనమా లేక పద్మ అవార్డు దుష్ప్రభావమా నాకు తెలియదు. కానీ అందరికీ తెలుసు మన దేశం 1947 ఆగస్టు 15న స్వతంత్రం పొందిందని. దీనికి భిన్నంగా కామెంట్స్ చేయడానికి ప్రయత్నించడం మూర్ఖత్వమే. దే హమే ఆజాదీ బినా ఖడగ్ బినా ధాల్, సబర్మతీ కే సంతే ట్యూనే కర్ దియా కమల్.. పైన పేర్కొన్న ప్రకటన వాస్తవికతకు దూరంగా ఉంది. వాస్తవం ఏమిటంటే ఎవరైనా బ్రిటిష్ ప్రభుత్వం మనస్సులో పారిపోవాలనే భయాన్ని సృష్టించింది అంటే అది దేశంలోని అసంఖ్యాక విప్లవకారుల త్యాగం, సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్, ఆయన స్వంత సైనికుల తిరుగుబాటు భయం అంటూ కంగనాకు విమర్శించారు
Tags:    

Similar News