సినిమాలంటే జనాలకు చాలా ఇష్టం. పైగా హారర్ సినిమాలంటే కొంతమంది ప్రాణం పెట్టేస్తూ ఉంటారు. రిలీజ్ అవడం ఆలస్యం థియేటర్లలో రెక్కలు కట్టుకుని వాలిపోతూ ఉంటారు. దీనికి ఏజ్ గ్యాప్ లు కూడా ఉండవు.
ఇప్పుడో పెద్దాయన ఇలాగే హారర్ సినిమాకి వెళ్లి ప్రాణం పోగొట్టుకున్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన ది కంజూరింగ్ 2 చిత్రం చూస్తూ గుండెపోటు రావడంతో మరణించాడు. ఈ సంఘటన తమిళనాడులోని తిరువణ్ణామలైలో జరిగింది. దీనిపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కూడా చేస్తున్నారు. వారు చెప్పిన డీటైల్స్ ప్రకారం తమిళనాడులో నివసిస్తున్న ఏపీకి చెందిన ఇద్దరు వ్యక్తులు కంజూరింగ్2 సినిమా చూసేందుకు థియేటర్ కు వెళ్లారు. సినిమా ఆసాంతం అయిపోయాక.. క్లైమాక్స్ సమీపిస్తుండగా ఇందులో ముదుసలి వ్యక్తికి గుండె పోటు వచ్చింది.
ఇతని వయసు 65ఏళ్లు కావడంతో.. హారర్ మూవీ బాగా ప్రభావం చూపించింది. సమీపంలోని హాస్పిటల్ కి తీసుకెళ్లినా ప్రయోజనం కనిపించలేదు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. హారర్ సినిమాల విషయంలో హార్ట్ ప్రాబ్లెమ్స్ ఉన్నవారు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ సంఘటన నిరూపిస్తోంది.