సీనియర్ ఎడిటర్ గౌతమ్ రాజు (68) ఇక లేరు. ఆయన గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధికి కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సంబంధీకులు చెబుతున్నారు. 06 జూలై వేకువ ఝామున 1.30 గం.లకు ఆయన కన్నుమూశారు.
గౌతమ్ రాజు తెలుగు చిత్ర పరిశ్రమలోని సీనియర్ మోస్ట్ ఎడిటర్లలో ఒకరు. పరిశ్రమలో వందలాది చిత్రాలకు పనిచేశారు. అన్ని వేళలా స్టార్ హీరోల మొదటి ఛాయిస్ ఆయనే. ఎడిటింగ్ టేబుల్ పైనే సినిమా ఫలితాన్ని చెప్పగలిగే మేధావిగా అతడి కంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది.
మూవీ మొఘల్ రామానాయుడు- దర్శకరత్న డా.దాసరి నారాయణరావు వంటి ప్రముఖులతో కలిసి పని చేసిన సీనియారిటీ ఆయనకు ఉంది. తెలుగు సినిమా పరిశ్రమకు ఆయన దశాబ్ధాల పాటు సేవలందించారు.
గౌతం రాజు గత కొన్ని నెలలుగా ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నారు. కిడ్నీ సంబంధిత సమస్య ఈ మరణానికి కారణమని తెలిసింది. ఆకస్మికంగా ఆయన మరణవార్త విన్న సినీ పరిశ్రమ మొత్తం షాక్ కు గురైంది.
గౌతమ్ రాజు మృతి వార్తలను పలువురు తెలుగు ఫిలిం జర్నలిస్టులు ధృవీకరించారు. ఆయనకు సామాజిక మాధ్యమాల్లో నివాళులు అర్పించారు.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ..కుటుంబసభ్యులకు స్నేహితులకు ఆత్మీయులకు బలం చేకూరాలని పరిశ్రమ ప్రముఖులు ప్రార్థిస్తున్నారు. అంత్యక్రియలకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.