సోషల్ మీడియాలో సెలబ్రెటీల పేరుతో ఫేక్ అకౌంట్ లు కుప్పలు తెప్పలుగా ఉంటాయి అనే విషయం తెల్సిందే. ముఖ్యంగా హీరోయిన్స్ పేరుతో అకౌంట్స్ పెద్ద ఎత్తున ఉంటాయి. ఇప్పుడు అదే సీనియర్ హీరోయిన్ కు కష్టాలు తెచ్చి పెట్టింది. సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ అయితే పర్వాలేదు కాని ఒక డేటింగ్ యాప్ లో హీరోయిన్ పేరుతో ఫేక్ అకౌంట్ ను క్రియేట్ చేసి కొందరు ఆకతాయిలు చేసిన పనికి కాస్త సీన్ క్రియేట్ అయ్యింది. ఆ హీరోయిన్ కాస్త ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఆ హీరోయిన్ మరెవ్వరో కాదు బాలీవుడ్ లో సుదీర్ఘ కాలంగా హీరోయిన్ గా మంచి పేరు దక్కించుకున్న ముద్దుగుమ్మ లారా దత్తా. ఈమె పేరుతో గుర్తు తెలియని ఆకతాయిలు డేటింగ్ యాప్ లో అకౌంట్ ను ఓపెన్ చేయడం జరిగింది.
లారా దత్త 43 ఏళ్ల వయసులో డేటింగ్ యాప్ లో జాయిన్ అయ్యారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం మొదలు అవ్వడతో ఒక్కసారిగా అందరి దృష్టి అటువైపు మరలింది. దాంతో ఆమె సోషల్ మీడియా ద్వారా అభిమానులు.. వాట్సప్ ద్వారా తెలిసిన వారు తెగ మెసేజ్ లు చేయడం మొదలు పెట్టారట. చాలా మంది లారా దత్త డేటింగ్ యాప్ లో అంటూ మీమ్స్ క్రియేట్ చేసి ట్రెండ్ చేయడం మొదలు పెట్టారు. మీడియాలో కూడా ఈ విషయమై కథనాలు రావడం మొదలు అయ్యింది. బాలీవుడ్ మీడియా డేటింగ్ యాప్ వ్యవహారంపై ఆమె గురించి కథనాలు అల్లడం మొదలు పెట్టడంతో ఆమె క్లారిటీ ఇచ్చేందుకు సిద్దం అయ్యారు.
ఆమె స్వయంగా మీడియా కు ఈ వార్తల విషయమై వివరణ ఇవ్వాల్సి వచ్చింది. నేను ఏ డేటింగ్ యాప్ లో కూడా లేను. ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా నేను డేటింగ్ యాప్ ను ఉపయోగించలేదు. నేను డేటింగ్ యాప్స్ కు వ్యతిరేకం అస్సలు కాదు. అవి ఒకరిని ఒకరు తెలుసుకునేందుకు మంచి ప్లాట్ ఫామ్స్ గా నేను భావిస్తాను. ఖచ్చితంగా డేటింగ్ యాప్స్ ను యూత్ ఉపయోగించుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేసింది. కాని తాను ఎప్పుడు కూడా డేటింగ్ యాప్స్ ను ఉపయోగించడం కాని.. ఆ మార్గంలో నడవడం కాని చేయలేదు అంది. వ్యక్తిగతంగా నాకు అలాంటివి నప్పవు అంది. డేటింగ్ యాప్ లో తన పేరుతో ఉన్న అకౌంట్ ఫేక్ అని.. తనకు ఆ విషయం తెలియజేసేందుకు చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఫేక్ అకౌంట్ పై చర్యలకు తాను ఆసక్తి చూపడం లేదని కూడా చెప్పుకొచ్చింది.