'మాస్ కా దాస్' విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ "పాగల్". ఇది యువ హీరోకి 5వ సినిమా. ఇందులో నివేదా పేతురాజ్ - సిమ్రాన్ చౌదరి - మేఘ లేఖ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నరేష్ కొప్పల్లి అనే కొత్త దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ - లక్కీ మీడియా బ్యానర్స్ పై బెక్కం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మే 1న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ - టీజర్ ఆసక్తిని కలిగించాయి. అయితే 'పాగల్' స్టోరీ ఇదేనంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో డిస్కషన్ జరుగుతోంది.
'పాగల్' కథ విషయానికొస్తే.. తల్లి ప్రేమకి దూరమై పాగల్ అయిపోయిన హీరో.. తల్లి మాదిరిగా ప్రేమని ఇచ్చే అమ్మాయిల కోసం వెతుకుతూ, కనిపించిన వారందరికీ ఐ లవ్ యూ చెబుతుంటాడట. ఈ క్రమంలో తల్లి మాదిరి ప్రేమను ప్రకాశ్ రాజ్ ఇస్తున్నాడని గ్రహించి, మన పాగల్ ఆయనకు ఐ లవ్ యూ చెబుతాడట. అయితే ఆ తరువాత ప్రేమలో ప్రతి ఒక్కడు పాగల్ అంటూ ఓ చిన్న ట్విస్ట్ తో ఈ సినిమా పూర్తవుతుందట. ఇదే 'పాగల్' మెయిన్ పాయింట్ అని ప్రచారం జరుగుతోంది. ఇందులో ఏ మాత్రం నిజముందో తెలియాలంటే విడుదలయ్యే వరకు ఆగాల్సిందే. కాగా, 'పాగల్' చిత్రానికి రథన్ సంగీతం సమకూరుస్తున్నాడు. మణికందన్ సినిమాటోగ్రఫీ అందించగా.. గ్యారీ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.