గత ఏడాది తమిళంలో విడుదల అయ్యి ఆస్కార్ నామినేషన్స్ ను దక్కించుకున్న సూర్య సూరారై పోట్రు కు ప్రస్తుతం సీక్వెల్ కోసం స్క్రిప్ట్ రెడీ అవుతుందా అంటే అవును అనే సమాధానం వినిపిస్తుంది. తమిళ మీడియాలో గత కొన్ని రోజులుగా ఈ సినిమా సీక్వెల్ గురించిన కథనాలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఎయిర్ డెక్కన్ ఫౌండర్ జీఆర్ గోపీనాథ్ సక్సెస్ స్టోరీ తో సూరాపై పోట్రూ తెరకెక్కిన విషయం తెల్సిందే. ఒక సామాన్య వ్యక్తి ఎయిర్ డెక్కన్ ను ఎలా ప్రారంభించాడు.. దాన్ని ఎలా సక్సెస్ చేసుకున్నాడు అనేది ఈ సినిమాలో కథగా దర్శకురాలు సుధ కొంగర చూపించారు. ఇప్పుడు సీక్వెల్ కు ఆమె స్క్రిప్ట్ ను రెడీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
మొదటి పార్ట్ లో ఎయిర్ డెక్కన్ సక్సెస్ స్టోరీని చూపించడం జరిగింది. అయితే ఎన్నో కష్టాలు పడి మొదలు పెట్టిన ఎయిర్ డెక్కన్ తక్కువ సమయంలోనే కనుమరుగయ్యింది. పోటీ దారుల వల్ల.. పోటీ ప్రపంచంలో ఆ ఎయిర్ డెక్కన్ నిలువలేక పోయింది. విజయ్ మాల్యా తీవ్ర ప్రయత్నాలు చేసి దానికి కొనుగోలు చేసి సర్వనాశనం కు దారి తీశాడు. ఇటీవల గోపీనాథ్ మాట్లాడుతూ నా తప్పును సరిదిద్దుకునే అవకాశం వస్తే నా ఎయిర్ డెక్కన్ ను విజయ్ మాల్యకు అమ్మకుండా ఉంటాను అంటూ వ్యాఖ్యలు చేశాడు.
ఇప్పుడు అదే పాయింట్ ను తీసుకుని సుధ కొంగర ఫెయిల్యూర్ స్టోరీని తయారు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎయిర్ డెక్కన్ ఎలా వెలుగు వెలిగింది.. ఆ సమయంలో దానిపై జరిగిన కుట్రలు కుతంత్రాలను సీక్వెల్ లో చూపించి చివరకు ఎయిర్ డెక్కన్ ఎలా కనుమరుగయ్యింది అనే విషయాన్ని చూపించేందుకు దర్శకురాలు ప్రయత్నాలు చేయనుంది. ప్రస్తుతం సూర్య మూడు సినిమాలు చేస్తున్నాడు. అవన్ని కూడా వచ్చే ఏడాది ఆరంభంకు పూర్తి అవ్వబోతున్నాయి. కనుక త్వరలోనే సూరారై పోట్రూ సీక్వెల్ కు సంబంధించిన అధికారిక అతి త్వరలోనే వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ తమిళ ఇండస్ట్రీ వర్గాల టాక్ వినిపిస్తుంది.