ఒకప్పుడు టీవీల్లో వీక్లీ సీరియల్స్ మాత్రమే వచ్చేవి. ఆ సీరియల్స్ కోసం వారం రోజుల పాటు వెయిట్ చేయవలసి వచ్చేది. ఆ తరువాత డైలీ సీరియల్స్ మొదలయ్యాయి. టైటిల్ సాంగ్స్ .. సినిమాల మాదిరి పాటలు చోటు చేసుకోవడంతో సీరియల్స్ రూపురేఖలు మారిపోయాయి. అప్పట్లో కథ ఏమిటనేది మొదటి నుంచి చివరివరకూ అనుకుని స్టార్ట్ చేసేవారు. అందువలన ప్రతి సీరియల్ కి ఏదో ఒక ముగింపు ఉంటూ వచ్చింది. ఇక ఎప్పుడైతే రేటింగ్స్ లెక్కలు మొదలయ్యాయో, అప్పటి నుంచి ఏ సీరియల్ కి కూడా ముగింపు అనేది లేకుండా పోయిందనే చెప్పాలి.
ఏ సీరియల్ లో ఈ ట్రాక్ ను జనాలు ఇష్టపడుతున్నారో చూసుకుని ఆ ట్రాక్ ను పెంచడం అనే ఆనవాయితీకి శ్రీకారం చుట్టేశారు. రేటింగ్ తగ్గగానే ఆ ట్రాక్ ను అక్కడే వదిలేసి మరో ట్రాక్ ను ఎత్తుకునే పరిస్థితులు వచ్చాయి. ఇలా ట్రాకులు మారుకుంటూ నేటి సీరియల్స్ గమ్యం లేని .. తెలియని ప్రయాణం చేస్తున్నాయి. ఇక ఈటీవీలో మొదటి నుంచి కూడా కథలకు మంచి ప్రాధాన్యతను ఇస్తూ వస్తున్నారు. అలాంటి ఈటీవీ వారు ఈ మధ్య కాలంలో ఒక కొత్త ట్రెండ్ ను సెట్ చేశారనే చెప్పాలి. అంతకుముందు వరకూ టీవీ సీరియల్స్ కి దాదాపు సినిమా టైటిల్స్ నే సెట్ చేసేవారు. జనాలకు త్వరగా కనెక్ట్ కావాలనే ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకునేవారు.
కానీ ఇప్పుడు ఆ సినిమాలకే సీక్వెల్స్ గా సీరియల్స్ ను నిర్మిస్తుండటం విశేషం. ఒక సినిమాకి కొనసాగింపుగా మరో సినిమా చేయడమనేది ఎప్పటి నుంచో ఉంది. అలాంటిది ఒక సినిమాకి సీక్వెల్ గా సీరియల్ చేయడమనేది కొత్త ట్రెండ్ గా మారిపోయింది. ఆ మధ్య ఈ టీవీలోనే 'యమలీల' సినిమాకి సీక్వెల్ వచ్చింది.
ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన 'యమలీల' విశేషమైన ఆదరణ పొందింది. ఫాంటసీని టచ్ చేస్తూ సాగే ఈ కథలోని మదర్ సెంటిమెంట్ ఆడియన్స్ కి ఒక రేంజ్ లో కనెక్ట్ అయింది. ఈ సినిమాలో ప్రధానమైన పాత్రలను పోషించిన అలీ .. మంజు భార్గవి, సీక్వెల్ సీరియల్ లోను చేయడం విశేషం.
అలా ఈ సీరియల్ కి ఎంత రేటింగ్ వచ్చింది .. ఎంతవరకూ ప్రేక్షకులను ఆకట్టుకుందనేది అలా ఉంచితే, ఇప్పుడు మళ్లీ 'మౌనపోరాటం' సినిమాకి సీక్వెల్ గా సీరియల్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నారు. ఓ యథార్థ సంఘటన ఆధా రంగా అప్పట్లో 'మౌనపోరాటం' సినిమాను నిర్మించారు .
ఈ సినిమాతోనే యమున పరిచయమైంది. ఇప్పుడు అదే యమున ప్రధాన పాత్రగా ఆ సినిమాకి కొనసాగింపుగా సీరియల్ చేస్తున్నారు. ఇలాంటి ఒక కొత్త ఫార్ములాకు కూడా ఈటీవీ వారే తెర తీశారు. మరి ఈ సినిమా సీరియల్ ను ప్రేక్షకులు ఏ స్థాయిలో ఆదరిస్తారనేది చూడాలి.