ముంబై తీరంలోని సముద్రంలో క్రూయిజ్ నౌకలో డ్రగ్స్ తో పట్టుపట్టాడనని.. తీసుకున్నాడని ఆరోపిస్తూ బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ను ఎన్సీబీ కేసులో ఇరికించి దాదాపు నెలరోజుల పాటు జైలు పాలు చేసింది. విచారణ చేసింది. తాను అమాయకుడిని అని ఎంత మొత్తుకున్నా కూడా ఎన్సీబీ, కోర్టు నాడు పరిగణలోకి తీసుకోలేదు. ఢిల్లీ నుంచి న్యాయవాదులు వచ్చి మరీ ఈ కేసులో వాదిస్తే 28 రోజులకు గానీ బెయిల్ రాలేదు. ఆర్యన్ ఖాన్ విడుదల కోసం తండ్రి షారుఖ్ ఖాన్ పడని బాధ లేదు.
అయితే ఈ కేసులో ఎన్సీబీ డైరెక్టర్ గా ఉన్న సమీర్ వాంఖడే ఉద్దేశపూర్వకంగానే ఆర్యన్ ఖాన్ ను ఇరికించాడన్న ఆరోపణలు వచ్చాయి. ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో పట్టుకొని చాలా రోజులు అతడికి బెయిల్ రాకుండా చూసిన అధికారిగా సమీర్ పేరు వెలుగులోకి వచ్చింది. అయితే క్రూయిజ్ నౌకలో డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఆర్యన్ ఖాన్ కు క్లీన్ చిట్ లభించింది. అనంతరం ఈ కేసులో మొండిగా ముందుకెళ్లిన అప్పటి ఎన్సీబీ డైరెక్టర్ సమీర్ వాంఖడేపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పటికే ఎన్సీబీ దీనిపై ఆయనకు నోటీసులు జారీ చేసినట్టు అంతర్గత విచారణ జరిపింది.
ఈ కేసు దర్యాప్తు ప్రారంభంలో నిర్లిప్తంగా వ్యవహరించినందుకు గానూ వాంఖడే పై చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించింది. ఆయనను ముంబై నుంచి చెన్నైకు బదిలీ చేస్తూ ఎన్సీబీ ఇచ్చింది. తాజాగా ఈ కేసులో ఆర్యన్ ఖాన్ ను ఉద్దేశపూర్వకంగా ఇరికించారని తాజా నివేదిక వెల్లడించింది. నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) విజిలెన్స్ విభాగం దానిని రూపొందించింది. ఈకేసు దర్యాప్తులో భాగంగా అధికారుల పాత్రపైనా అనుమానం వ్యక్తం చేసింది. విచారణలో భాగంగా పలు లోపాలను గుర్తించినట్టు పేర్కొంది.
ఈ డ్రగ్స్ కేసు విచారణలో ఏడెనిమిది మంది అధికారుల తీరు అనుమానాస్పదంగా ఉందని దర్యాప్తు బృందం గుర్తించింది. ఆర్యన్ ఖాన్ ను ఉద్దేశపూర్వకంగా ఇరికించినందున ఆ కేసును సరైన రీతిలో దర్యాప్తు చేయలేదని తేలింది. ఇదంతా ఎందుకు చేశారో తెలియాల్సి ఉందని నివేదిక వెల్లడించింది.
ఎన్సీబీ ముంబై యూనిట్ లో విధులు నిర్వహించిన అప్పటి జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే సహా ఇతర అధికారులపై చర్యలకు సిఫారసు చేసింది. ఈ నివేదికను ఢిల్లీలోని కేంద్ర కార్యాలయంలో సమర్పించింది.
ఎన్సీబీ మాజీ డైరెక్టర్ సమీర్ వాంఖడే 2021 అక్టోబర్ లో క్రూయిజ్ షిప్ పై దాడి చేసి షారుఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్ సహా 19 మంది ప్రముఖులను అరెస్ట్ చేసిన ఘటనలో వార్తల్లో నిలిచారు. ఈ డ్రగ్స్ కేసులో అవినీతి ఆరోపణలు రావడంతో సమీర్ వాంఖడే నుంచి కేంద్ర ఎన్సీబీ బృందానికి దర్యాప్తు బాధ్యత అప్పగించారు.
అప్పట్లో బాలీవుడ్ సెలబ్రెటీలు దీపికా పడుకొణే, సారా అలీఖాన్, రకూల్ ప్రీత్ సింగ్ లను సమీర్ వాంఖడే డ్రగ్స్ కేసులో విచారించడం సంచలనమైంది. ఈ క్రమంలోనే సమీర్ వాంఖడే దే తప్పు అని ఈ కేసులో ఆర్యన్ ఖాన్ ను ఇరికించారని నివేదికలో వెల్లడైంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.